అంజీర్ పండును ఇలా చేసి తీసుకుంటే 10 రోజుల్లో మధుమేహం తగ్గుతుంది.
అత్తి పండ్లలో పోటాషియం, ఖనిజ లవణాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పలు రకాల వ్యాధులకు అంజీర్‌తో చెక్ పెట్టవచ్చు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు ఇది ఇన్సులిన్‌గా పనిచేసి కంట్రోల్ చేస్తుంది. ఆయుర్వేదంలో అంజీర్ పండ్లకు ప్రత్యేకమైన స్థానముంది. అయితే మధుమేహం నియంత్రించుకునే క్రమంలో తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది.
ఇలా పాటించడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో మధుమేహం కారణంగా రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి వివిధ రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే సమస్యలకు చెక్ పెట్టడానికి పలు పోషకాలున్న డ్రై ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా ఉండడమే కాకుండా అన్ని అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మధుమేహంతో బాధపడుతున్నవారికి అంజీర పండు చాలా మేలు చేస్తుంది.
ఈ పండులో శరీరానికి కావాల్సిన ఫైబర్, కాల్షియం, ఐరన్, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రిస్తుంది. అంజీర పండులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలు కలగడమేకాకుండా చెడు కొలెస్ట్రాల్ సమస్యలు దూరమవుతాయి. మధుమేహంతో బాధపడుతున్నవారు ఈ పండ్లను 4 నుంచి 5 గంటలు పాలలో నానబెట్టి..
రాత్రి నిద్రపోయే ముందు తినాలి. అయినప్పటికీ మీరు దానిని పరిమిత పరిమాణంలో తినవాల్సి ఉంటుంది. అంజీర్ ఆకుల్లో కూడా చాలా రకాల మూలకాలు ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు అంజీర్ ఆకులను టీలో మరిగించి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. అంజీర్ పండ్లతో పాటు.. డయాబెటిస్తో బాధపడుతున్నవారు యాపిల్స్, ఆప్రికాట్లు, బ్లూబెర్రీస్, కాంటాలప్, చెర్రీస్, కివీస్, నారింజ, బొప్పాయి, స్ట్రాబెర్రీలు మొదలైన పండ్లను కూడా తినవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.