అంజీర్ పండ్లను నీటిలో నానబెట్టి ఉండయన్నే తింటే ఎంత మంచిదో తెలుసా..?
ఈ సీజన్‌లో మనకు అత్యధికంగా అనేక రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. అయితే ముఖ్యంగా అంజీర పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిందని డైటీషియన్లు, వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లలు మొదలు.. వృద్ధుల వరకు అందరూ ఈ పండ్లను తినవచ్చు. ఇవి తినడం ద్వార అనేక రోగాల బారి నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఎంతోమంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు అంజీర పండ్లను రోజుకు ఒకటి, రెండు పండ్ల చొప్పున తిన్నా మంచి ఫలితం కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల డ్రై ఫ్రూట్స్‌లో అంజీర్ పండ్లు ఒకటి.
వీటిని సీజనల్‌గా అయితే నేరుగా పండ్ల రూపంలోనే తినవచ్చు. పైన ఊదా, లోపల ఎరుపు రంగులో ఉంటాయి. అయితే ఇవి మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలో అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉంటాయి. కనుక డ్రై ఫ్రూట్స్‌ను మనం సులభంగా తినవచ్చు. ఇక చాలా మంది వీటి రూపం కారణంగా వీటిని తినేందుకు ఇష్టపడరు. కానీ వీటిని మూడు తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపునే వాటిని తినాలి. అనంతరం ఆ నీళ్లను తాగాలి. ఇలా రోజూ పరగడుపునే నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల పీచు అధికంగా లభిస్తుంది. ఇది అరుగుదలకు మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగు పరుస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. చిన్నారులకు వీటిని రెండు పూటలా తినిపించడం మంచిది. పెద్దలు కూడా వీటిని తింటే గ్యాస్, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. పొట్టంతా శుభ్రమవుతుంది. అలాగే హైబీపీని అదుపు చేయడానికి అంజీర్‌ను తినాలి. ఇందులో ఉండే పొటాషియం అధిక రక్త పోటును అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
ఇక ఈ పండ్లను తినడం వల్ల రక్తహీనత నుంచి బయట పడవచ్చు. మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు రోజూ అంజీర్‌ను తీసుకోవడం మంచిది. ఇందులో హిమోగ్లోబిన్ స్థాయిల్ని పెంచే పోషకాలు అధికంగా ఉంటాయి. దీంతో రక్తహీనత తగ్గుతుంది. కనుక రోజూ పరగడుపునే అంజీర్ పండ్లను తినాలి. ఇక బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తినాలి. కొన్ని ముక్కల్ని భోజనానికి ముందు తీసుకోవడం వల్ల పొట్ట త్వరగా నిండిపోతుంది. అతిగా తినే సమస్య తగ్గుతుంది.
కొలెస్ట్రాల్ సమస్య ఉండదు. హృద్రోగాలతో బాధపడేవారు ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో అంజీర్‌ను చేర్చుకుంటే మేలు. ఇందులో పెక్టిన్ అనే పదార్ధం శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. గుండెకు మేలుచేస్తుంది. సంతానం కోరుకునేవారు అంజీర్‌ను ఎంత తీసుకుంటే అంత మంచిది. దీనిలో అధికంగా ఉండే మెగ్నీషియం, మాంగనీస్, జింక్ సంతాన సాఫల్యతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కనుక అంజీర్ పండ్లను రోజూ తినాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.