News

యాంకర్ సుమకు కోట్ల ఆస్తులు ఉన్నా డబ్బు కోసం ఇంకా ఏం చేస్తుందో తెలుసా..?

సుమ ఒక్క షోకు ఎంత వసూలు చేస్తుంటారో తెలుసుకోవాలనీ చాలా మందికి ఆసక్తి ఉంటుంది. సుమ తెలుగులో పాపులర్ యాంకరే కాదు.. టాప్ యాంకర్ కూడా. స్టార్ హీరోలకు చెందిన ఏ ఫంక్షన్ అయినా, సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు అయిన ఆమె హోస్ట్ చేయాల్సిందే. సుమ ఒక్కో షో, ఈవెంట్‌కి దాదాపుగా రూ. 2-2.5 లక్షలు వసూలు చేస్తుంటారని టాక్. తెలుగు ఇండస్ట్రీలోని టాప్ యాంకర్‌లలో ఒకరిగా పేరుపొందిన ఈ 47 ఏళ్ల స్టార్ యాంకర్ ప్రస్తుతం పలు టీవీ షోలతో సూపర్ బిజీగా ఉన్నారు.

అయితే రెండు మూడు తరాలకు సరిపడా సంపాదించినా యాంకర్ సుమ కూడా అదే చేస్తుంది. డబ్బుల కోసం చెత్త ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తుంది. ఈ విషయంలో ఆమెపై జనాలు మండిపడుతున్నారు. సుమ బుల్లితెరపై ఓ చరిత్ర సృష్టించారు. రోజుకు లక్షల్లో సంపాదించే ఆమె కోట్లలో కూడబెట్టారు. హైదరాబాద్ లో సుమకు లగ్జరీ హౌస్ ఉంది. ఆ ఇంట్లో షూటింగ్స్ కూడా జరుగుతాయట.

భర్త రాజీవ్ కనకాల నటుడిగా కొంత సంపాదిస్తున్నాడు. రాజీవ్ సంపాదన కంటే సుమ ఎక్కువ సంపాదన కలిగి ఉన్నారు. ఆ మధ్య సుమ భర్తతో విడిపోతుందనే ప్రచారం జరిగింది. రాజీవ్ కనకాల-సుమ కొన్నాళ్ళు విడివిడిగా ఉన్నారు. దీంతో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. తర్వాత సుమ ఈ వార్తలను పరోక్షంగా ఖండించారు. ఇద్దరూ కలిసి ఓ షో చేశారు. రాజీవ్ కనకాల అయితే వివరణ ఇచ్చారు. నేను కొన్నాళ్ళు మా నాన్నగారి ఇంట్లో ఉన్న విషయం నిజమే. అయితే అది మనస్పర్ధలతో కాదు.

కొన్ని కారణాల వలన దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. ఇంత సంపద ఉన్న యాంకర్ సుమ నాసిరకం ప్రొడక్ట్స్ ని డబ్బుల కోసం ప్రమోట్ చేస్తున్నారని సాధారణ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమ ఓ పచ్చళ్ళ తయారీ సంస్థ యాడ్ లో పాల్గొన్నారు. ఆ సంస్థ పచ్చళ్ళు అద్భుతం అంటూ వీడియోలో చెప్పారు. ఆ పచ్చళ్ళు వాడిన కస్టమర్స్ కి చేదు అనుభవం ఎదురైంది.

టేస్ట్ లేకుండా నాసిరకంగా ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి నాణ్యత లేని ప్రొడక్ట్స్ ని డబ్బుల కోసం సుమ ప్రోమోట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నేరుగా సుమకు తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సుమ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. సుమ ఈ మధ్య ఎక్కువగా షోలు చేయడం లేదు. సుమ అడ్డా టైటిల్ తో ఓ టాక్ షో చేస్తున్నారు. గతంలో సుమ అరడజను షోలు చేసేవారు. మరోవైపు ఆమె కొడుకును హీరోగా పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మేరకు సుమ ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker