వాతావరణ వార్తలు చదువుతూ లైవ్‌లోనే సొమ్మసిల్లిన యాంకర్, వైరల్ అవుతున్న వీడియో.
దూరదర్శన్ కోల్‌కతా బ్రాంచ్‌లో గత గురువారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు 21 యేళ్లుగా బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో ఉన్న సిన్హా ఆరోజు ఉదయం ప్రోగ్రాంకి ముందే ఒంట్లో కాస్త నలతగా అనిపించిందని తెలిపారు. లైవ్ ప్రోగ్రాం కావడంతో తన వద్ద వాటర్ బాటిల్ ఉన్నప్పటికీ మాటిమాటికీ నీళ్లు తాగలేకపోయానని అన్నారు. అంతేకాకుండా లైవ్ ప్రోగ్రాం మధ్యలో విజువల్స్ గానీ, బ్రేక్‌లు గానీ లేకపోవడంతో షో ముగిసే వారకు నీళ్లు తాగడానికి అవకాశం లేకపోయిందన్నారు.
అయితే పశ్చిమ బెంగాల్‌లో విపరీతమైన వేడి గురించి లైవ్ న్యూస్ రిపోర్ట్ ఇస్తూ దూరదర్శన్ యాంకర్ కళ్లు తిరిగి పడిపోయారు. దూరదర్శన్ కోల్‌కతా బ్రాంచిలో పనిచేస్తున్న లోపాముద్ర సిన్హా అనే యువతి స్పృహతప్పి పడిపోయారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఫేస్‌బుక్ ద్వారా పంచుకుంది. వార్తలు చదువుతున్న సమయంలో ఒక్కసారిగా రక్తపోటు పడిపోవడంతో కుప్పకూలినట్లు ఆమె తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించింది.
“వార్త ప్రసారానికి ముందు అస్వస్థత చెందాను. ఒక గ్లాసు నీళ్లు తాగాలని అనుకున్నాను. ఇంతలోనే లైవ్‌కి వెళ్లిపోయాను. లైవ్‌లో నీళ్లు తాగలేకపోయాను’’ అని సిన్హా చెప్పారు. ఆ వార్తలను చదువుతూనే ఉండగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఆఖరికి తీవ్ర వేడికి సంబంధించిన వార్తలను చదువుతూ కుప్పకూలిపోయింది. సిన్హా ఏమన్నారంటే, “నా స్వరం తగ్గింది. తరువాత టెలిప్రాంప్టర్ సరిగా చూడలేకపోయాను.
నా చూపు మసకబారినట్లు అనిపించింది” అని తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉండటం కూడా ఆమె సొమ్మసిల్లడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాలతోపాటూ.. బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 15 న, ఒడిశాలో వడదెబ్బ కారణంగా ఒకరు చనిపోయారు.
బాలాసోర్ జిల్లా మహేశ్‌పూర్‌కు చెందిన లక్ష్మీకాంత సాహు (62) వడదెబ్బతో మృతి చెందినట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయ అధికారి తెలిపారు. అందువల్ల ఎండల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.