News

సొంతూరులో భర్తతో కలిసి హోమం చేపించిన అనసూయ. అసలు విషయమేంటంటే..?

అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. ముఖ్యంగా ‘క్షణం’, ‘రంగస్థలం’లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. ‘కథనం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయకు ప్రేక్షకులు పెద్ద షాక్ ఇచ్చారు.

అయితే ఎప్పుడు గ్లామర్ ఫోటోషూట్లతో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా యజ్ఞ హోమాలు చేస్తూ ఉన్న ఒక వీడియోను షేర్ చేయడంతో పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అనసూయ ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియోలో తన భర్త భరద్వాజతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తోంది.

అంతేకాదు అనసూయ కుటుంబ సభ్యులు కూడా సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. కొంతమంది వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య భక్తి పారవశ్యంలో మునిగిపోయారు అనసూయ దంపతులు. అంతేకాదు హరినామాలు కూడా పెట్టుకున్నారు. అక్కడి వాతావరణం గమనించినట్లయితే సొంత ఊరిలో కులదైవానికి ప్రత్యేక పూజలు జరుపుకుంటున్నారేమో అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మొత్తానికైతే ఎప్పుడు గ్లామర్ లుక్ లో కనిపించే అనసూయ ఇలా ట్రెడిషనల్ లుక్ లో భక్తి పారవశ్యంలో మునిగిపోయి కనిపించడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker