News

కేవలం 500 కోసం కాలేజీ రోజుల్లో అనసూయ ఎలాంటి పని చేసిందో తెలుసా..?

స్టార్ యాంకర్ అనసూయ..వయసు పెరుగుతున్న తరగని అందంతో హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తుంది ఈ అందాల యాంకరమ్మ. ఇక నటన పరంగాను అనసూయ మంచి మార్కులు సొంతం చేసుకుంటుంది. రంగస్థలం సినిమాలో తన నటనతో కట్టిపడేసింది. అయితే టాలీవుడ్ క్రేజీ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తోంది.

తెలుగు యాంకరింగ్‌లో గ్లామర్‌ను అద్దిన అతికొద్ది మందిలో ఈ భామ కూడా ఒకరు. అనసూయ యాంకరింగ్‌ను ఆపేసి.. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోంది. అయితే అనసూయ కెరీర్ మొదలైంది నటిగానే. చదువుకునే రోజుల్లోనే ఆమె నటిగా ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలో అనసూయకు 2003లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన “నాగ’ సినిమాలో ఓ చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది.

ఈ మూవీలో అనసూయకు ఎలాంటి డైలాగ్స్ ఉండవు. ఒక సన్నివేశంలో సునీల్ మాట్లాడుతుంటే వెనుక అనసూయ స్టూడెంట్ పాత్రలో కనిపిస్తుంది. అయితే నాగ సినిమాలో అనసూయ కాలేజి స్టూడెంట్ పాత్రలో కనిపించే సమయానికి ఆమె వయస్సు 19 ఏళ్లు. అయితే ఆ పాత్రలో నటించిన అనసూయకు రూ. 500 చెల్లించారట.

అది ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి ఆ రోజుల్లో ఇచ్చే పేమెంట్. ఇప్పుడు అనసూయ రేంజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె సంపాదన రోజుకు లక్షల్లో ఉంటుంది. నెటిజన్లు ఎన్ని రకాల నెగిటివ్ కామెంట్లు పెట్టిన ఎప్పటికప్పుడు ఇచ్చిపడేస్తూ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది అనసూయ.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker