News

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో రజినీకాంత్ స్టెప్పులు అదుర్స్, వైరల్ వీడియో.

ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. 60 ఏళ్లు దాటినా ఆయన ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు. తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకొని ప్రేక్షకుల మెప్పిస్తున్నారు. రజినీకాంత్ ఏది చేసినా స్టైలే. అయితే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంటి పెళ్లి సంబరాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ముఖేష్ చిన్న కొడుకు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి శుక్రవారం రాత్రి వారి ‘శుభ్‌ వివాహ్‌’ జరిగింది.

భూలోక స్వర్గాన్ని తలపించేలా చేసిన ఏర్పాట్లు అద్దిరిపోయాయి. దేశవిదేశీ ప్రముఖులు రెడ్​ కార్పెట్​పై ఫోజులిస్తూ కనిపించారు. ప్రపంచ నలుమూలల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార రంగాల అతిరథ మహారథులు తరలిరావడంతో ముంబైలోని జియో వాల్డ్‌ సెంటర్ కళకళలాడింది. ఇక పెళ్లికొడుకు అనంత్ అంబానీ బారాత్ వస్తున్న సమయంలో సెలబ్రిటీలు అందరూ కారు ముందర డ్యాన్స్​ వేస్తూ కనిపించారు. అందులో జాన్ సీనా, సల్మాన్​ ఖాన్, షారుక్ ఖాన్, విక్కీ కౌశల్‌, రణ్‌వీర్ సింగ్​ లాంటి స్టార్స్ తమ స్టెప్పులతో అదరగొట్టారు.

ఆ సమయంలో రజినీ కూడా హుషారుగా స్టెప్పులేశారు. ప్రముఖ బాలీవుడ్ సాంగ్​కు సింపుల్​గా డ్యాన్స్ చేసి అదరగొట్టారు. అనంత్‌ పెళ్లిలో రజనీకాంత్‌ డ్యాన్సులు వేయడం స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారింది. అత్యంత అట్టహాసంగా జరగనున్న ఈ వెడ్డింగ్‌కు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, క్రీడాకారులు తరలివస్తున్నారు. ప్రత్యేక అతిథులను తీసుకొచ్చేందుకు అంబానీ మూడు ఫాల్కన్ జెట్లను ఏర్పాటు చేశారు. అలాగే పెళ్లికి సంబంధించిన ఈవెంట్ల కోసం 100కు పైగా ప్రైవేట్ విమానాలు ఉపయోగించనున్నారు. మొత్తంగా ఈ పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా 1200 మంది అతిథులు హాజరైయ్యారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker