ఈ నూనెలో కాళ్ళపై మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు వెంటనే తగ్గిపోతాయి.
ఆముదం నూనెలో రిసినోలియెక్ ఆమ్లం, ఒమెగా – 6 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని అనేక ఇన్ఫెక్షన్లను నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే ఈ నూనెలో విటమిన్ ఎ, కెలు ఉంటాయి. ఆముదం నూనెతో తలలో రక్తప్రసరణను సవ్యంగా ఉంచుకోవచ్చు. జుట్టుకు నూనె పెట్టిన తరువాత ఐదు నుండి పది నిమిషాల పాటు మర్దన చేయాలి.
ఇలా చేయడం వలన తల బాగంలో రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పెరగడానికి చక్కగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇంకా అనేక ప్రయోజనాలు ఆముదం నూనెతో ఉన్నాయి. ఆముదం నూనె కీళ్ల నొప్పులు తగ్గించటానికి ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆముదం నూనెతో మర్దన చేయాలి. ఆముదం నూనెలో ముంచిన వస్త్రాన్ని నొప్పి ఉన్న చోట కట్టి గంట సేపు ఉంచాలి, ఆ తరువాత ఆ ప్రదేశంలో వేడినీటితో పెట్టి కొద్దిసేపు మర్దన చేయాలి. ఇలా చేస్తే నొప్పి పోతుంది. చిన్న పిల్లల తలకు ఆముదం నూనెను ప్రతి రోజు పెట్టె వారు అలా చేయడం వలన పిల్లల జుట్టు చక్కగా ఉండేది.
ఒక రెండు చుక్కల ఆముదం నూనె తీసుకొని గోర్ల పైన పూసుకుంటే గోర్లు చిగురులు బలంగా ఉంటాయి, గోర్లు మెరుస్తూ అందంగా కనిపిస్తాయి. ఆముదం నూనెను రెండు చుక్కలు తీసుకొని చేతులకి మరియు అరచేతులకి పూయడం వలన చేతులు సున్నీతంగా మారతాయి. స్త్రీలు గిన్నెలు తోమడం వలన చేతులు పొడిబారీ పోయి ఉంటాయి అలాంటి వారు, రోజు ఆముదం నూనె చేతులకి పూయడం వలన చేతులు మృదువుగా ఉంటాయి. అరికాళ్ళలో పగుళ్లు ఉన్నవారు ఆముదం నూనె రోజు కాళ్ళకు రాయడం వలన అరికాళ్ళ పగుళ్లు పోయి కాళ్ళు మృదువుగా ఉంచుకోవచ్చు.
ఆముదం నూనె మరియు ఆలివ్ ఆయిల్ రెండిటినీ కలిపి కన్ను రెప్పలకి కి రాయటం వల్ల ఐ బ్రోస్ త్వరగా పెరగటానికి, నలుపు రంగులో కనిపించటానికి సహాయపడుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలంటే ఆయిల్ ని రెండు చుక్కలు తీసుకొని వేళ్ళతో కన్ను చుట్టూ పెట్టి ఐదు నిమిషాలు మర్దన చేయాలి ఇలా రోజు చేయాలి, ఇలా చేయడం వలన మంచి ఫలితం పొందవచ్చు. ఎండ వల్ల కమిలిపోయి నల్లగా అయిన చర్మం మళ్ళీ మామూలుగా అవ్వాలి అంటే ఆముదం నూనె పూతలాగా పూసి ఒక గంట తరువాత చల్లని నీటితో ముకం కడుక్కోవాలి.
ఆముదం నూనెను చర్మం పైన పూతలాగా పూయాలి ఇలా చేయడం వలన చర్మం బిగుతుగా అవ్వడమే కాకుండా ముడతలు కూడా తగ్గుతాయి. ఆముదం చర్మం అడుగున ఉండే కొల్లజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఆముదంలో ఉండే ఒమేగా యాసిడ్స్ వలన చర్మం పైన పూయడంతో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ది చెంది, మచ్చలు పోతాయి. నులిపురుగు మరియు మలబద్దకం నివారణ కోసం ఆముదం నూనె ఎక్కువగా వాడుతారు. అయితే నాలుగు స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకొని 2 స్పూన్స్ ఆముదం నూనె కలిపి మెత్తని వస్త్రాన్ని నూనెలో ముంచి పొట్ట మీద రాత్రి అంతా అలాగే ఉంచాలి. ఇలా చేయడం వలన ఉదయం వరకు నులి పురుగులు చనిపోతాయి.