అంబానీ కోడలు హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా..? ఆ ఖర్చుతో అపార్ట్మెంట్ కొనొచ్చు.
భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ నిర్మించిన అద్భుత కట్టడం నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆసియా నంబర్- 1 ధనవంతుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఈ జైలైలో, తన స్నేహితురాలు, ఎంటర్ ప్రెన్యూర్ రాధికా మర్చెంట్ తో జూన్ నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే గుజరాత్ జామ్ నగర్ లో మూడు రోజుల ప్రీవెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. అయితే ఈవెంట్ ఏదైనా కానీ రాధికా మర్చెంట్ ధరించే ఖరీదైన దుస్తులు, ఆభరణాలు, హ్యాండ్ బ్యాగుల గురించి అహూతుల్లో ఆసక్తికర చర్చ సాగింది.
ఇంతకుముందు పెళ్లి వేడుకలో అంబానీ కాబోయే కోడలు రాధిక మర్చెంట్ ధరించిన హ్యాండ్ బ్యాగ్ ఖరీదు గురించి బోలెడంత చర్చ సాగింది. ఈ హీర్మేస్ కెల్లీ బ్యాగ్ విలువ 65 లక్షలు! అంటూ ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ మీడియా ఫోటోగ్రాఫర్ ఖరీదును వెల్లడించడంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు. పట్టుమని పది పెన్నులు, పిన్నులు అయినా ఇందులో పడతాయో లేదో.. కానీ ఇంత చిన్న బ్యాగ్ కోసం 65లక్షలు ఖర్చు పెడుతుందా? దీంతో ఒక అపార్ట్ మెంట్ కొనుక్కోవచ్చు! అంటూ నెటిజనుల్లో గుసగుసలు మొదలయ్యాయి.
నిజానికి ఇంతకుముందు ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవంలోనే ఇదే బ్రాండ్ లో మరో విలక్షణమైన బ్యాగ్ తో రాధిక మర్చెంట్ కనిపించింది. అప్పుడు తన చేతికి ధరించిన హీర్మేస్ కెల్లీ మార్ఫోస్ బ్యాగ్ ఖరీదు గురించి నెటిజనుల్లో విస్త్రతంగా చర్చ సాగింది. హీర్మేస్ బ్యాగ్‌లు చౌకగా రావు సరే కానీ.. ఈ ప్రత్యేకమైన హీర్మేస్ కెల్లీ మార్ఫోస్ బ్యాగ్ రూ. 52,30,000 (సుమారు RM 281,355) ధర ట్యాగ్ ని కలిగి ఉంది అని హిందీ మీడియా వెల్లడించింది. ఇది రాచరికపు దర్పానికి చిహ్నం. మినియేచర్ బ్యాగ్‌ల కొత్త ట్రెండ్‌కు అనుగుణంగా ఈ చిన్న బ్యాగ్ షహబ్-దురాజీ నుండి రూపొందినది.
నిజానికి హీర్మేస్ కెల్లీ మార్ఫోస్ బ్యాగ్ ఎందుకు ఇంత ఖరీదైనది? అంటే ఇది కేవలం బ్యాగ్ మాత్రమే కాదు.. ఆభరణం కూడా.. అని చెబుతున్నారు. ఈ ఐకానిక్ బ్యాగ్‌ని పునర్నిర్మించవచ్చు.. లేదా అవసరానికి అనుగుణంగా మార్చవచ్చు. దానిని శరీరం అంతటా స్లింగ్ చేయడానికి బదులుగా మెడ, మణికట్టు, వేళ్లకు ఆభరణంగా ఉపయోగించవచ్చు. రాధికా మర్చంట్ ఎంచుకున్నది స్టెర్లింగ్ సిల్వర్లోని హెర్మెస్ కెల్లీ సాక్ బిజౌ చైన్… అని కూడా హిందీ మీడియా విశ్లేషించింది.