అలోవెరా జ్యూస్ తాగితే మీ రక్తం మొత్తని శుద్ధి చేస్తుంది.
కలబంద మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ప్రజలు దాని అద్భుతమైన లక్షణాల గురించి మరింత తెలుసుకుంటున్నారు. అందుకే.. దానిని ఏదో ఒక విధంగా దినచర్యలో భాగంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కలబంద జ్యూస్‌కు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే ఒక విధంగా చెప్పాలంటే అలోవెరా అనేది ఒక ఎడారి మొక్క పెరట్లో అందం కోసం పెంచే ఈ మొక్క వలన చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి.
ఈ అలోవెరా మొక్కను కాస్మొటిక్, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.కలబంద రసంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. కలబంద రసం హైడ్రేటింగ్‌గా ఉంటుంది కాబట్టి దీన్ని రెగ్యులర్‌గా తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి.
ఇందులో జింక్, కాల్షియం, పొటాషియం, సోడియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కలబంద రసం తాగడం వలన చర్మంపై అలర్జీలు తగ్గుతాయి.అలాగే ఈ కలబంద రసాన్ని రోజూ తాగడం వల్ల రక్తం శుద్ధి అవ్వడంతో పాటుగా కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.కలబంద రసం తాగడం వలన మలబద్ధక సమస్య కూడా తగ్గుతుంది.
కలబంద రసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.కలబంద పూర్తిగా సహజమైనది కాబట్టి ఇది మన ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదు. అయితే ఈ కలబంద రసం తాగడానికి కాస్త చేదుగా ఉంటుంది. రసం తాగలేని వాళ్ళు కలబంద జెల్లిని రోజు కొద్ది కొద్దిగా అయినా తింటూ ఉండవచ్చు.