Health

ఆల్బుకారా పండు తింటున్నారా..? అయితే ఈ నిజాలను తప్పక తెలుసుకోండి.

వాతావరణ మార్పుల వల్ల మన శరీరాలు అనారోగ్యానికి గురికాకుండా నిరోధించడంలో అల్ బుక‌రా పండు సహాయపడుతుంది. అల్ బుక‌రా పండ్లు మన శరీరంలోని మలినాలను తొలగించడంలో సహకరిస్తాయి. అల్ బుఖారా పండ్లు దంతాలు మరియు ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. అల్ బుక‌రా ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలోని అధిక వేడి తగ్గుతుంది.

అయితే పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రుచిగా ఉండటంతోపాటు.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే.. సీజనల్ వారీగా దొరికే పండ్లను మిస్ కాకుండా ఎల్లప్పుడూ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. వీటి ద్వారా శరీరానికి అన్ని పోషకాలు లభిస్తాయి.

ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో అలూబుఖారా ఒకటి.. రోస్ జాతికి చెందిన ఈ పండ్లు రేగుపండ్ల మాదిరిగా అనేక రంగుల్లో ఉంటాయి. వీటిలో ఎరుపు రంగు ఉన్న పండ్లను ఎక్కువగా తింటుంటారు. వీటిలో 2,000 రకాల పండ్లు ఉన్నాయని పేర్కొంటున్నారు. అందుకే రోజూ ఒక పండును తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

ఈ రుచికరమైన అలూబుఖారా పండ్లు యాంటీఆక్సిడెంట్, నిర్విషీకరణ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి జీవక్రియ, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. క్రోమియం, పొటాషియం, సెలీనియం, ఇతర ఖనిజాలతోపాటు విటమిన్ C, బీటా-కెరోటిన్‌లను కలిగి ఉంటాయి. ఆలూబుఖారా పండ్లు వయస్సు భారాన్ని తగ్గించడంతోపాటు.. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. ఇంకా కంటిచూపును కూడా మెరుగుపరుస్తాయి.

మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే, ఈ పండును మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండు తింటే బ‌రువు కూడా తగ్గొచ్చు. రోజూ తిన‌డం వ‌ల్ల శరీరంలోని కొవ్వు క‌రిగిపోతుంది. ఇంకా గుండె సమస్యలను నిరోధించడంతోపాటు.. రక్తప్రసరణ నిర్వహణను మెరుగుపర్చి హృదయ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఆలూబుఖారా పండ్లు పనిచేస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker