Health

అల్లం, వెల్లులి మిశ్రమన్ని ఇలా తీసుకుంటే బయటకు చెప్పలేని రోగాలన్నీ మటుమాయం.

అల్లం, వెల్లుల్లి పేస్ట్ లను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని నిల్వ ఉంచుకోవచ్చు అని అంటున్నారు ప్రముఖ చెఫ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమాన్ని తగిన కొలతలతో తయారు చేసుకుంటే.. రెండు మూడు నెలలు నిల్వ ఉంటుందని సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్ చెబుతున్నారు. అంతేకాదు తాజాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలనే వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అయితే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అల్లం, వెల్లుల్లి రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

వీటిని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. LDL కొలెస్ట్రాల్ స్థాయిలను 10-15 శాతం వరకు తగ్గిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. మధుమేహం ఉన్నవారికి మంచిది..మధుమేహులు వెల్లులి తమ ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మేలు చేస్తుంది. అల్లం, వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీర్ఘకాలికంగా రక్తంలో చక్కెరను గుర్తించే అణువు హిమోగ్లోబిన్ A1c (HbA1c) స్థాయిలను తగ్గించడానికి కూడా పని చేస్తాయి. ప్రతి రోజు ఉదయం వేడి వేడి అన్నంలో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కాసేపు ఉంచుకొని తర్వాత వాటిని తింటే మధుమేహులకి చాలా మేలు.

రోగనిరోధక శక్తి పెంచుతుంది..ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జ్ఞాపకశక్తి పెంచుతుంది. ఇవి మెదడుకి మేలు చేస్తాయి. అవి జ్ఞాపకశక్తిని పెంచడంలో మెరుగ్గా పని చేస్తాయి. అభిజ్ఞా క్షీణతను నిరోధించడంలో సహాయపడే నరాల కణాలను కాపాడేందుకు సహకరిస్తాయి. అల్లం వెల్లుల్లి సూప్..ఈ రెండింటితో కలిపి సూప్ చేసుకుని తాగితే అన్నీ రోగాలకు ఔషధంగా పని చేస్తుంది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్ళు దీని తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

మహిళలు వారానికి ఒక సారైనా ఈ సూప్ తాగితే నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు..వెల్లుల్లిలో సల్ఫర్ గుణాలు అధికంగా ఉన్నాయి. బరువు తగ్గేందుకు బాగా పని చేస్తాయి. వెల్లుల్లి నీళ్ళు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులతో పోరాడేందుకు సమర్థవంతంగా పని చేస్తాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6లు రోగనిరోధక శక్తిని పెంచి, సీజన్ వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తాయి. దోమలకు చెక్..దోమలను తరిమి కొట్టడంలో వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుంది. వెల్లుల్లి నీళ్ళు స్ప్రే చేస్తే ఆ వాసనకి అవి పారిపోతాయి. వెల్లుల్లి వాసన దోమలకి అసలు నచ్చదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker