News

ఘోర ప్రమాదం నుంచి బయట పడ్డ అలీ కుటుంబం, ఏం జరిగిందో తెలిస్తే..?

సినిమాలలోను రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆలీ కుటుంబం తాజాగా ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు అలీ భార్య జుబేదా తన యూట్యూబ్ ఛానల్ లో తెలియజేశారు.అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే విషయాలన్నింటిని కూడా ఈమె ఈ వీడియో ద్వారా అయితే తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. అయితే దాదాపు 1200 సినిమాల్లో కమెడియన్ గా హీరోగా నటించి మెప్పించిన ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే మనదగ్గర టక్కున చెప్పే పేరు అలీ.

ఆయన కామెడీ టైమింగ్ కు, ఆయన నటనకు ప్రేక్షకులంతా ఫిదా అవుతారు. అలీ ఉన్నాడంటే సినిమాలో కామెడీ నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని అందరు అంటుంటారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన అలీ హీరోగానూ పలు సినిమాల్లో నటించాడు. కేవలం అలీ కోసమే సినిమాలకు వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం పలు టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరో వైపు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు అలీ.

ఇటీవలే అలీని ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించింది. అలీ ఫ్యామిలీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలీ సతీమణి, ఆయన పిల్లల గురించి కూడా అందరికి తెలిసిందే. రీసెంట్ గా అలీ కూతురు కూడా వివాహం జరిగింది. ఇదిలా ఉంటే అలీ కుటుంబం ప్రమాదం నుంచి బయటపడ్డారు. అలీ భార్య జుబేదా కూడా యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తోన్న విషయం తెలిసిందే.

తాజాగా ఆమె తన ఛానెల్ లో తాము ప్రమాదం నుంచి బయటపడిన విషయం గురించి చెప్పారు. అలీ కూతురు ఫాతిమా ఇటీవలే అమెరికా నుంచి వచ్చారు. అదే సమయంలో ఆమె అత్తమామలు కూడా రావడంతో అంతా కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్నారట. ఈ క్రమంలోనే అంతా ఫ్లైట్ ఎక్కి ఎక్కడికో వెళ్లారట.. భారీ వర్షం కారణంగా వారు ఎక్కిన ఫ్లైట్ ప్రమాదంలో చిక్కుకుందట.

దీంతో వారికి గుండె ఆగిపోయినంత పనైందట. అరగంట తర్వాత విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యిందట. సేఫ్ ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker