Health

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు, మనుషులపై దాడికి సిద్ధమైన మరో వైరస్‌.

కొంతకాలంగా క్షీరదాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు తరచూ వెలుగుచూస్తుండటంపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వైరస్ మనుషులకూ సోకేలా రూపాంతరం చెందే ముప్పు లేకపోలేదంటూ హెచ్చరించింది. సాధారణంగా ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు పక్షుల్లో వ్యాపిస్తాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకరమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ మహమ్మారి భయాందోళనల నుండి ప్రపంచం కోలుకుంటున్న తరుణంలో కొనసాగుతున్న ‘బర్డ్ ఫ్లూ’ వ్యాప్తి గురించి WHO బుధవారం ఆందోళనకరమైన హెచ్చరికలు జారీ చేసింది.

ఇటీవలి బర్డ్ ఫ్లూ వ్యాప్తి మానవులకు సులభంగా సోకుతుందని హెచ్చరించింది. కొంతకాలంగా క్షీరదాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు తరచూ వెలుగుచూస్తుండటంపై WHO ఆందోళన వ్యక్తం చేసింది. క్రమేణ మానవులకు సోకేలా బర్డ్‌ఫ్లూ వైరస్‌ రూపాంతరం చెందే ముప్పు ఉందంటూ WHO హెచ్చరించింది. సాధారణంగా ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెవజీ వైరస్‌లు పక్షుల్లో వ్యాపిస్థాయి.

అయితే, వాటిలో ఒకటైన బర్డ్‌ఫ్లూ కారక హెచ్‌5ఎన్‌1 ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజాను ఇటీవలి కాలంలో క్షీరదాల్లోనూ గుర్తించారు. దాదాపు మనుషులకూ సులువుగా సంక్రమించేలా క్షీరదాల్లో ఈ వైరస్‌ రూపాంతరం చెందే ముప్పుందని డబ్ల్యూహెచ్‌వో బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కొన్ని క్షీరదాల్లో ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు, కలగవలిసి,మానవులు, జంతువులకు హాని కలిగించేలా కొత్త వైరస్‌లు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది.

క్షీరదాలలో ప్రాణాంతక వ్యాప్తికి సంబంధించిన నివేదికలు పెరుగుతున్నాయని WHO పునరుద్ఘాటించింది. WHO ప్రకారం.. మూడు ఖండాలలోని దాదాపు 10 దేశాలు 2022 నుండి క్షీరదాలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందాయని నివేదించాయి. స్పెయిన్, యుఎస్, పెరూ, చిలీ, వంటి దేశాలలో వ్యాప్తి చెందడం వల్ల భూమి, సముద్ర క్షీరదాలు రెండూ ప్రభావితమయ్యాయని అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది.

H5N1 వైరస్‌లు అనేక దేశాలలో పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులలో కూడా కనిపించాయని చెప్పింది. ఇటీవలి కాలంలో పిల్లులలో H5N1 గుర్తించబడినట్లు పోలాండ్‌లోని అధికారులు ప్రకటించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker