Health

నిద్ర మాత్రలు వాడుతున్నారా..? ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు.

నిద్ర మాత్రలు నిద్ర పట్టడానికి వాడే ఒకరకమైన ఔషధము.రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోయినా, ఏవైనా ఒత్తిళ్లతో సతమతమైపోతున్నా.. వెంటనే గుర్తొచ్చేది నిద్రమాత్ర. చాలామంది నిద్ర కోసం ఈ పద్ధతినే అనుసరిస్తుంటారు. తరచూ ఇవి వాడటం వల్ల అదే అలవాటుగా మారుతుంది. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అయితే, నిద్రమాత్రలు తరచూ మింగడం వల్ల వివిధ రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. అయితే ప్రతి మనిషికి ఒక రోజులో కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం.

అప్పుడే శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి, మెదడు మెరుగ్గా పనిచేస్తుంది. నిద్ర తగ్గితే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు దాడి చేయవచ్చు. నిద్రలేమికి చాలా కారణాలు ఉన్నాయి. అధిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటివి మానసికపరమైన కారణాలు. అయితే అధిక కాఫీ తీసుకోవడం, ఆకలితో పడుకోవడం, జీర్ణక్రియ సరిగా లేకపోవడం వంటివి శారీరక కారణాలుగా చెప్పుకోవచ్చు. నిద్రలేమికి కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి చికిత్స చేసుకుంటే నిద్ర సహజంగానే వస్తుంది.

అలా కాకుండా నిద్ర మాత్రల వాడకాన్ని మొదలుపెడితే అవి శరీరంపై దుష్ప్రభావాలను చూపిస్తాయి. ఈ ప్రభావాలు తప్పవు.. నిద్ర పట్టడం లేదని వైద్యుల వద్దకు వెళితే ముందుగా జీవనశైలిలో మార్పులు చేసుకోమని సూచిస్తారు. కానీ ఎక్కువమంది తమ లైఫ్ స్టైల్ ను మార్చుకోవడానికి ఇష్టపడరు. తద్వారా స్లీపింగ్ మాత్రలు వైద్యులచే రాయించుకుంటారు. అయితే వాటికి అలవాటు పడినవారు సహజంగా నిద్రకు దూరం అవుతారు.

నిద్ర మాత్రలు వాడడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఎలా ఉంటాయంటే తల తిరగడం, గందరగోళంగా అనిపించడం, ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, జుట్టు రాలిపోవడం, మెరుగ్గా ఆలోచించ లేకపోవడం వంటివి కలుగుతాయి. కాబట్టి నిద్ర మాత్రలను పక్కనపెట్టి సహజంగా నిద్రపట్టే పట్టేందుకు సహకరించే పద్ధతులను పాటించాలి. ముఖ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ధ్యానం, యోగా వంటివి రోజూ చేయాలి. మానసిక వైద్యులను సంప్రదించి బిహేవియరల్ థెరపీని పొందాలి.

వీటివల్ల నిద్ర సమస్యలు తగ్గే అవకాశం ఉంది. నిద్ర మాత్రలు వాడేవారు ఎక్కువగా పగటిపూట కూడా మగతగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు మీద రద్దీ ప్రాంతాల్లో నడుస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎక్కువ నిద్ర మాత్రల వాడకాన్ని తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడం ద్వారా నిద్ర సహజంగా పట్టేలా చూసుకోండి. నిద్ర పట్టాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఎన్ని సమస్యలున్నా రాత్రి నిద్రపోయే ముందు మాత్రం ఆ సమస్యలను మర్చిపోయి హాయిగా నిద్రపోవాలి. అలాగే నిద్రను పెంచే ఆహారాలను వైద్యులను సంప్రదించి వాటిని మెనూలో చేర్చుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker