Health

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అది ప్రాణాంతక లంగ్ క్యాన్సర్‌ కావొచ్చు.

ధూమపానం చేసేవారితో పాటు పాసివ్ స్మోకింగ్‌కు గురయ్యే వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు భారతదేశంలో పెరుగుతున్నాయి. అయితే ఇది ఎప్పుడూ ధూమపానం చేయని వారిని కూడా ప్రభావితం చేస్తుంది. మన దేశంలో పురుషులలో అత్యంత సాధారణ క్యాన్సర్ అయిన ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న రోగులలో చాలా మంది సిగరెట్ తాగిన చరిత్ర ఉన్న వారే. ధూమపానం ఊపిరితిత్తులలోని కణాలను దెబ్బతీస్తుంది. ప్రారంభంలో మీ శరీరం నష్టాలను సరిచేయడానికి ప్రయత్నించినా కాలక్రమేణా కణాలు అసాధారణంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. అయితే ప్రపంచ మానవాళిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది.

ఈ క్యాన్సర్ ఒక కణంగా శరీరంలో ఏర్పడి.. ఆ తర్వాత దేహమంత శరవేగంతో వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలోనే ప్రాణాంతక వ్యాధిగా కూడా మారుతుంది. క్యాన్సర్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో లంగ్ క్యాన్సర్ లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా ప్రధానమైనది. దూమపానం, మధ్యపానం లేదా జీవనశైలి మార్పులు కారణంగా వ్యాపించే ఈ క్యాన్సర్‌ అత్యంత ప్రమాదకరం. దీన్ని తొలి దశలోనే నియంత్రించకపోతే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్యాన్సర్‌కి కొన్ని రకాల లక్షణాలు ఉన్నాయని, అవి సంకేతాలుగా మన శరీరంలో కనిపిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు.

వాటిని గుర్తించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. లంగ్ క్యాన్సర్ ప్రారంభ దశ లక్షణాలు, సంకేతాలు.. బరువు తగ్గడం.. ఏ క్యాన్సర్‌ వచ్చినా వ్యాధిగ్రస్థులలో సర్వసాధారణంగా కనిపించే లక్షణం బరువు తగ్గడం. శరీరంలో క్యాన్సర్‌ కణాలు వేగవంతంగా వ్యాపించడం వల్ల ఉన్నపాటుగా బరువు తగ్గుతారు. ఇలా సడెన్‌గా బరువు తగ్గితే తప్పనిసరిగా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి ఫుల్‌ బాడీ చెకప్‌ చేయించుకోవడం మంచిది. ఒకవేళ క్యాన్సర్‌ అని తేలితే ప్రారంభ దశలోనే నియంత్రించవచ్చు.

శ్వాస సమస్యలు.. లంగ్‌ క్యాన్సర్‌ సోకిన వారిలో ప్రారంభదశ నుంచే శ్వాస తీసుకోవడం కష్టతరంగా ఉంటుంది. అయితే కొందరిలో ఇతర కారణాల వల్ల కూడా ఈ సమస్య కనిపించే అవకాశం ఉన్నప్పటికీ.. ఎడతెరపి లేకుండా ఇదే ఇబ్బంది ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. సమస్య ఏదైనా ఆదిలోనే తుంచేయడం మంచిది. నొప్పులు: లంగ్ క్యాన్సర్‌ బారిన పడినవారిలో సాధారణంగా కనిపించే మరో లక్షణం భుజాలు, ఛాతి, వెన్నెముక భాగాల్లో నొప్పి.

అయితే ఈ నొప్పులు కూడా కొన్ని సందర్భాల్లో సహజంగా కనిపించినా ధీర్ఘకాలికంగా ఉంటే మాత్రం అనుమానించి వైద్యుడిని సంప్రదించాలి. విపరీతమైన దగ్గు.. ఎడతెరపి లేని విపరీతమైన దగ్గు కనుక మిమ్మల్ని దీర్ఘకాలంగా వేధిస్తున్నట్లయితే మీరు దాన్ని లంగ్ క్యానర్స్ లక్షణంగానే అనుమానించాలి. అంతేకాక వెనువెంటనే వైద్యుడిని సంప్రదించి చెకప్ చేయించుకోవాలి. గొంతు మార్పు.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సోకినవారిలో గొంతు మార్పు కూడా ప్రారంభ లక్షణమే. మీరు మాట్లాడే సమయంలో మీ గొంతు మారినట్లు కనుక మీకు అనిపిస్తే అనతికాలంలోనే వైద్యుడిని సంప్రదించండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker