ఎలక్షన్స్ కి ముందు తేల్చేసిన తారకరత్న భార్య అలేఖ్య, అలేఖ్య రెడ్డి ట్విట్ వైరల్.
మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాయి. ఈ తారకరత్న తెలుగు దేశం పార్టీలో నాయకుడిగా ఎదగాలని ఆశపడ్డాడు. ప్రస్తుతం తారక రత్న లేకపోవడంతో ఆయన భార్య అలేఖ్య గురించి చర్చ వస్తోంది. అయితే నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన ట్విట్ వైరల్ అవుతుంది. ‘‘ నేను ఎటువైపు ఉన్నానంటూ ఎవరైనా అడిగితే.. ఖచ్చితంగా మా కుటుంబం వైపే ఉంటాను. ఏ విధమైన అంశాలు ఆశించకుండా మా మామయ్య గారికి విష్ చేస్తున్నాను’’ అని అలేఖ్యా పేర్కొన్నారు.
ఈ ట్వీట్ ద్వారా నందమూరి బాలకృష్ణకు మద్దతు ఇస్తున్నట్లు అలేఖ్య రెడ్డి స్పష్టం చేసినట్లు అయింది. హిందూపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ ఇటీవలే నామినేషన్ దాఖలు చేశారు. అదే సమయంలో అలేఖ్య రెడ్డి ఇలా ట్విట్ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకొంది. ఇప్పటికే బాలయ్య బాబు వరుసగా రెండు సార్లు హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతేడాది అంటే 2023 జనవరి 27వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పంలో యువగళం పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
ఆ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. అయితే ఆయన తీవ్ర అనారోగ్యంతో కుప్పంలో కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని బెంగళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరిలో మరణించారు. ఆ సమయంలో నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ అలేఖ్య కుటుంబానికి అండగా నిలిచిన విషయం విధితమే. మరోవైపు వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. అలేఖ్య రెడ్డికి సమీప బంధువు. తారకరత్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో.. అతడి ఆరోగ్య పరిస్థితిని మీడియాకు సాయిరెడ్డి విపులీకరించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ ఏడాది ఉగాది వేడుకలు అలేఖ్య నివాసంలో విజయసాయిరెడ్డి జరుపుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా విజయసాయిరెడ్డి.. అలేఖ్య రెడ్డి నివాసంలో జరుపుకున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి కూడా పెద్దనాన్న విజయసాయిరెడ్డి స్పెషల్‌గా రావడానికి మించిన సంతోషం మరొకటి లేదంటూ అలేఖ్య పేర్కొన్నారు. ఏపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు ఉంచింది.
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో నిరసన చేపట్టారు. ఈ నిరసన దీక్షలో అలేఖ్య రెడ్డి పాల్గొన్నారు. తారకరత్న ఆకస్మిక మరణం అనంతరం .. ఆ కుటుంబానికి అండగా ఉంటానని బాలయ్య బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తారకరత్నకుటుంబంతో బాలయ్య బాబుతోపాటు అతడి కుమారుడు మోక్షజ్ఝ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదీకాక తారకరత్నకు బాబాయి బాలయ్య బాబుతో మంచి అనుబంధం ఉంది.