మద్యం ఎంత తాగినా మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు.
కాలేయం మనం సజీవంగా ఉండేందుకు సహాయపడే 500కి పైగా ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఇది అవసరమైనప్పుడు శీఘ్ర శక్తిని అందిస్తుంది, గ్లూకోజ్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది, శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది, ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అయితే మితంగా తింటే ఆహారం.. అమితంగా తింటే విషం అని ఓ సినిమాలో రజినీకాంత్ చెబుతారు గుర్తుందా? ఆయన చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం. ఆయనేదో ఊరికే చెప్పలేదు. అది నిజమే. ఏదైనా మితంగా తింటేనే మంచిది. అమితంగా తింటేనే లేనిపోని సమస్యలు. అది మందయినా.. ఇంకేదైనా అని చెబుతున్నారు డాక్టర్లు.
అంటే.. మితంగా మందు తాగితే నష్టాలు కాదు… లాభాలేనట. రోజుకు మూడు పూటలు అన్నం తిన్నట్టుగా రోజూ ఓ పెగ్ మందు తాగి ఊరుకుంటారా? ఊరుకోరు. లెక్కలేసుకొని మందు తాగలేరు. అదే ఇప్పుడు అతి పెద్ద సమస్య. చాలామంది ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు బాటిళ్లకు బాటిళ్లు తాగేస్తారు. అదే వాళ్లకు దెబ్బ కొట్టేది. ఛీప్ లిక్కర్ ఎక్కువగా తాగినా సమస్యే. దాని వల్ల లివర్ కు లేనిపోని సమస్యలు. అది లివర్ ను విష పదార్థాలను నిలువ చేస్తుంది. దీంతో లివర్ కు లేనిపోని సమస్యలు వస్తాయి. మందు తాగి లివర్ ను నాశనం చేసుకోకుండా.. లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోగలిగితే చాలు.. మీరు మితంగా మందు తాగుతున్నా పెద్ద ఎఫెక్ట్ ఉండదు.
అటువంటి వాళ్లు ఏం చేయాలంటే…! గ్రీన్ టీని అలవాటు చేసుకోవాలి. గ్రీన్ టీలో తన్నిన్స్, కటేచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి లివర్ ఆరోగ్యానికి మంచిది. లివర్ లో ఉండే ప్రమాదకర విష పదార్థాలు ఫైబ్రోసిస్, సిర్రోసిస్, హేపతెతిస్ లాంటి వాటిని ఆ యాంటీ యాక్సిడెంట్లు నాశనం చేస్తాయి. అందుకే… మద్యం అలవాటు ఉన్నవాళ్లు.. టీ, కాఫీలు మానేసి… గ్రీన్ టీ తాగితే బెటర్. రోజుకో ఆపిల్ ను తినండి. మద్యం తాగే వాళ్లకు ఎప్పుడూ కడుపులో మంట ఉంటుంది. జీర్ణాశయంలో కడుపు మంట వస్తుంది.
దీని బారి నుంచి తప్పించుకోవడానికి ఆపిల్ ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆపిల్ లో ఉండే పెక్టిన్ అనే కెమికల్ లివర్ లో ఉండే టాక్సన్స్ ను కూడా నాశనం చేస్తాయి. అల్లం రోజూ తింటే మంచిది. అల్లాన్ని డైరెక్ట్ గా తినలేకపోతే.. ద్రవ పదార్థాంలా తీసుకోవడమో లేదా.. అల్లం రసాన్ని నీళ్లలో కలుపుకొని తాగడమో చేయాలి. దీని వల్ల అల్లంలో ఉండే అల్లిసిన్, సెలేనియం లివర్ ను కాపాడుతాయి. విటమిన్ సీ ఉండే ఏ పళ్లయినా సరే లివర్ కు మంచిది. మద్యం తాగడం వల్ల లివర్ లో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలు, విష రసాయనాలను విటమిన్ సీ ఉంటే సిట్రస్ జాతి ఫలాలు నాశనం చేస్తాయి.
అందుకే బత్తాయిలు, నారింజ పళ్లు, నిమ్మను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే.. ఆపిల్ సీడెడ్ వెనిగర్ కు కూడా మంచిదే. అది కూడా టాక్సిన్స్ ను తొలగిస్తుంది. వాటితో పాటు క్యారెట్స్, టమాట, పాలకూర, బీట్ రూట్.. లాంటి కూరగాయలను కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అవి కూడా డీటాక్సిఫికేషన్ కు ఉపయోగపడతాయి. రోజూ వీటన్నింటినీ తీసుకుంటూ మద్యం కూడా తాగితే మీ లివర్ కు ఎటువంటి డోకా ఉండదు. మీ లివర్ పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. ఒక వేళ మద్యం మాత్రమే తీసుకొని వీటిని వదిలేస్తే మాత్రం మీ లివర్ కు కష్టాలే కష్టాలు.