డబ్బుల కోసం నా ఇంటికి రావొద్దు, వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ ఆదిరెడ్డి.
అయ్యో ఆకలి అంటే ఎంతమందికి అయినా భోజనం పెట్టిస్తా. పెద్ద పెద్ద కోరికలు అడిగితే తీర్చే అంత సంపాదన, టైం నా దగ్గరలేదు. అందుకే దయచేసి అందరికీ చెబుతున్నా.. దయచేసి ఇంటి కానీ, సెలూన్ కి కానీ రావొద్దు… అని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆదిరెడ్డి వీడియో వైరల్ అవుతుంది. అయితే ఆదిరెడ్డి క్రేజ్ తోటి గత బిగ్ బాస్ సీజన్ లో ఒక నెల రోజుకు 39 లక్షల సంపాదించానని ప్రకటించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు.
ఇక ఇప్పుడు ఆదిరెడ్డికి ఒక వింత అనుభవం ఎదురైనట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అసలు విషయం ఏమిటంటే ఆదిరెడ్డి తనకొచ్చిన డబ్బుతో తన సొంత ఊరిలో ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాడు, అదేవిధంగా విజయవాడలో జావేద్ హబీబ్ ఫ్రాంచైజ్ తీసుకుని సెలూన్ నడుపుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి తన వంతు సహాయం చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఉంటాడు ఆదిరెడ్డి.
ఈ నేపథ్యంలో ఆదిరెడ్డిని సహాయం కోరే వారి సంఖ్య ఎక్కువ అయి పోయిందని దీంతో తన ఇంటికి కానీ సెలూన్ కి కానీ ఎవరూ రావద్దని చెబుతున్నాడు. నేను సహాయం చేయగలిగినంత వరకు చేయగలను అమెరికా వెళ్లాలి ఇంగ్లాండ్ వెళ్ళాలి అని వచ్చి సాయం చేయమంటే నేనేం చేయగలను? నేనేమీ ఒక వ్యవస్థను కాదు కదా ఒక ఏరియాలో పెద్ద మనిషిని కూడా కాదు కద అన్నాడు. ఆకలి అంటే భోజనం పెట్టించగలను, పెద్ద పెద్ద కోరికలు కోరితే తీర్చే అంత సంపాదన కానీ టైం కానీ తన దగ్గర లేదని చెప్పుకొచ్చాడు.
అందరికీ దయచేసి చెబుతున్నాను మా ఇంటికి కానీ సెలూన్ కి కానీ రావద్దు అంటూ ఆయన విన్నవించుకున్నాడు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.