News

ఆ అరుదైన వ్యాధితో బాధపడుతోన్న పుష్ప విలన్, జీవితాంతం భరించాల్సిందే అంటున్న ఫహద్‌ ఫాజిల్‌.

ఫహద్‌ ఫాజిల్‌..పుష్ప సినిమాలో ఫహద్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర అందరికీ గుర్తుండిపోతోంది. పుష్ప 2లోనూ ఈ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆవేశం సినిమాతో మరో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు నటుడు. ప్రస్తుతం మలయాళంలో స్టార్ హీరోగా రాణిస్తున్న ఫహద్‌.. అవకాశం వస్తే.. ఇతర భాషా చిత్రాల్లో కూడా అదే స్థాయిలో అదరగొడుతున్నాడు. అయితే పేరుకు మలయాళ నటుడే అయినప్పటికీ తెలుగులోనూ ఫాహద్ ఫాజిల్ మంచి గుర్తింపు ఉంది.

ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైపోయాడు. ఇందులో ఫాహద్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర అందరికీ గుర్తుండిపోతోంది. పుష్ప 2లోనూ ఈ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆవేశం సినిమాతో మరో బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారీ నటుడు. ప్రస్తుతం మలయాళంలో స్టార్ యాక్టర్ గా వెలుగొందుతున్న ఫాహద్ ఫాజిల్ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు.

ఇటీవల ఓ స్కూల్ ఓపెనింగ్ కు వెళ్లిన ఈ స్టార్ యాక్టర్ తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని చెప్పి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. కేర‌ళ‌లోని ఒక చిల్డ్ర‌న్ రీ హాబిలిటేష‌న్ సెంట‌ర్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఫాహద్ తాను ADHD వ్యాధి బారిన పడ్డానని చెప్పుకొచ్చాడు. ADHD అంటే అటెన్ష‌న్ డెఫిసిట్ హైప‌ర్ యాక్టివ్ డిసార్డ‌ర్ అని 41 ఏళ్ల వయసులో ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు చెప్పుకొచ్చాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. మరి దీనికి చికిత్స ఉంది అని అతనినే అడగ్గా.. చిన్నతనంలోనే బయట పెడితే క్యూర్ చేయచ్చని, కానీ తనకు 41 ఏళ్ల వయసులో బయటపడిందని తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చాడీ స్టార్ యాక్టర్.

ADHD లక్షణాలు ఇవే.. వైద్య నిపుణుల ప్రకారం ADHD తో సతమతమయ్యే వారికి ఏ విషయంపైనా ఏకాగ్రత, ధ్యాస ఉండదు. హైప‌ర్ యాక్టివ్, హైప‌ర్ ఫోక‌స్, ఇంప‌ల్సివిటీ లాంటి లక్షణాలు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. వారే క్రియేటివ్ గా ఉండాలనుకుంటారు. సైకలాజికల్ గా ఎంతో ఒత్తిడిలో ఉంటారు. తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని తెలుస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker