Health

అబార్షన్‌ తర్వాత మహిళలు ఈ పనులు అస్సలు చేయొద్దు. ఎందుకంటే..?

గర్భం ద్వారా ఏర్పడిన పిండం, దాని సంబంధిత భాగాలు, పిండం చనిపోయిన తరువాత గర్భాశయం నుండి బయట పడడాన్ని గర్భస్రావం అంటారు. గర్భస్రావం ఏ కారణం లేకుండా కూడా జరుగవచ్చును. కొన్ని రకాల కారణాల వలన కూడా గర్భస్రావం జరగవచ్చును. అయితే గర్భస్రావం తరువాత నొప్పి ఉంటుంది. నెలసరిలో వచ్చినట్లుగా రక్తస్రావం అవుతుంది. అయితే ఈ రెండు సమస్యలు రెండు వారాల్లోపు తగ్గిపోవాలి. ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉండి, రక్తస్రావం కూడా తీవ్రంగా అవుతున్నా, అదే సమయంలో దుర్వాసనతో కూడిన డిశ్చార్జి కనిపించినా, జ్వరంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంసప్రదించి తగిన చికిత్స పొందాలి.

రక్తస్రావం పూర్తిగా ఆగిపోయి, సౌకర్యంగా అనిపించేంత వరకూ కలయికలో పాల్గొనకూడదు. కొద్దిరోజులు పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవడమే మంచిది. ఏకాగ్రత కుదరక, నిద్రపట్టక, ఆకలి వేయక ఇబ్బందిపడుతున్నప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. అలాగే కొందరు ఈ సమయంలో చాలా ఒత్తిడికి లోనవుతారు. మళ్లీ గర్భం దాల్చినా అదే పరిస్థితి ఎదురవుతుందేమోనన్న భయం ఉంటుంది. చివరకు మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. రెండు అంతకన్నా ఎక్కువ సార్లు గర్భస్రావాలు అయినప్పుడు గర్భం దాల్చేముందు, డాక్టర్‌ సలహా తీసుకోవడం తప్పనిసరి.

దానికి గల కారణాలు డాక్టర్లు తెలుసుకుని ముందు జాగ్రత్తగా అవసరమైన చికిత్సలు చేసి, మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. మహిళలు యాంటీ డి ఇంజెక్షన్‌ని గర్భస్రావం తరవాత తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల్ని కొంతవరకూ నివారించవచ్చు. గర్భస్రావం ఒకసారి అయినా, అంతకన్నా ఎక్కువసార్లు జరిగినా మళ్లీ గర్భం దాల్చి, అది ఏ ఆటంకం లేకుండా నవమాసాలూ కొనసాగాలనుకుంటే ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని పాటించాలి. సాధ్యమైనంత వరకూ అన్నిరకాల పోషకాలు లభించే ఆహారాన్ని ఎంచుకోవాలి. దీని వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.

శరీర బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి. రోజులో కనీసం అరగంట ఏదో ఒక వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మానసికంగా కృంగుబాటు లేకుండా ఉంచేందుకు వ్యాయామం దోహదపడుతుంది. మళ్లి గర్భందాల్చిన సందర్భంలో గర్భస్రావం కాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. గర్భధారణకు కనీసం కొన్ని నెలల ముందునుండి ఫోలిక్‌యాసిడ్‌ని వైద్యుల సలహాలమేరకు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకూ ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలి. ఒకటికన్నా ఎక్కువగా గర్భస్రావాలు జరిగితే మళ్లీ అలాంటి సమస్య ఎదురుకాకుండా దానికి కారణాలు తెలుసుకునేందుకు వైద్యుల సూచనతో తగిన పరీక్షలు చేయించుకోవాలి.

ముఖ్యంగా హార్మోన్లూ, రోగనిరోధశక్తికి సంబంధించిన సమస్యల్ని తెలుసుకునేందుకు వైద్యులు రక్త పరీక్షలు దోహదం చేస్తాయి. గర్భస్రావం జరిగాక ఆ కణజాలాన్ని కూడా పరీక్ష చేయొచ్చు. ఇవి కాకుండా గర్భాశయం పనితీరు తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ కూడా చేస్తారు. కొన్నిసార్లు గర్భాశయ గోడల్నీ, ఫెల్లోపియన్‌ ట్యూబుల పనితీరునూ అంచనా వేసేందుకు టెలిస్కోప్‌ ఆకారంలో ఉండే చిన్న పరికరాన్ని గర్భాశయ ముఖద్వారం నుంచి గర్భాశయంలోకి ప్రవేశపెట్టి పరీక్షిస్తారు. పరిస్థితిని బట్టి సోనోహిస్టెరోగ్రామ్‌ పద్ధతినీ ఎంచుకోవచ్చు. దానివల్ల గర్భాశయ పొరల్లో ఉన్న సమస్యల్నీ తెలుసుకునే అవకాశం ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker