News

పెళ్లై 14 ఏళ్లవుతున్నా పిల్లలు లేకపోవడంతో ఈ స్టార్ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా..?

తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటించి అభిరామి సత్తా చాటారు. ప్రస్తుతం ఈ బ్యూటీ గరుడన్ అనే సినిమాలో కీలక పాత్రలో టిస్తున్నారు. అభిరామి చేసిన పోస్ట్ కు 150000కు పైగా లైక్స్ వచ్చాయి. అభిరామి కెరీర్ పరంగా మరింత ఎదగాలని వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అయితే మలయాళ నటి అభిరామి దంపతులు తల్లిదండ్రులయ్యారు. అదేంటి, ప్రెగ్నెన్సీ విషయాన్ని నటి ఇంతకాలంగా దాచిపెట్టిందేంటి? అనుకునేరు. బిడ్డను కనకుండానే ఆమె తల్లయింది. అభిరామి దంపతులు ఓ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఏడాది కాలంగా ఆ పాప వీళ్ల దగ్గరే ఉంటోంది.

తాజాగా ఈ విషయాన్ని మదర్స్‌ డే సందర్భంగా మే 14న సోషల్‌ మీడియాలో వెల్లడించింది నటి. తమ కూతురికి కల్కి అని నామకరణం చేసినట్లు తెలిపింది. ఒక తల్లిగా మదర్స్‌ డే సెలబ్రేట్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు కూతురితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ అభిరామి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హ్యాపీ మదర్స్‌ డే అంటూ నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అభిరామి షేర్‌ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అభిరామి ప్రముఖ రచయిత పవనన్‌ మనవడు రాహుల్‌ పవనన్‌ను 2009లో పెళ్లాడింది. ఇంతవరకు వీరికి పిల్లలు లేకపోవడంతోనే ఓ చిన్నారిని దత్తత తీసుకుని పెంచుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఆమె తెలుగులో చెప్పవే చిరుగాలి, అమర్‌ అక్బర్‌ ఆంటోని, చార్మినార్‌, థాంక్యూ సుబ్బారావు వంటి పలు చిత్రాల్లో నటించింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అనేక చిత్రాలు చేసింది. ప్రస్తుతం సురేశ్‌ గోపీ ప్రధాన పాత్రలో నటిస్తున్న గరుడన్‌ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker