News

దగ్గుబాటి అభిరామ్ పెళ్లి, అమ్మాయి ఎవరో తెలుసా..?

తాజాగా దగ్గుబాటి అభిరామ్ కు వివాహం కుదిరినట్లు తెలుస్తోంది. రామానాయుడు తమ్ముడు మనవరాలిని అభిరాం పెళ్లి చేసుకోనున్నారు. దగ్గుబాటి ఫ్యామిలీ ప్రస్తుతం పెళ్లి హడావిడిలో ఉంది. సురేష్ బాబు చెల్లెలి కూతురిని అభిరామ్ వివాహం చేసుకోనున్నారు. పెళ్లి కుమార్తె కుటుంబం ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా కారంచేడులో నివసిస్తోంది. అమ్మాయి ఉన్నత చదువులు చదివింది.

చిన్నతనం నుంచి కూడా అభిరామ్ కు ఆ అమ్మాయి అంటే ఎంతో ఇష్టమని సమాచారం.
అయితే అభిరామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? అనే విషయాన్ని నెటిజన్లు బాగా సెర్చ్ చేస్తున్నారు. అయితే, పెళ్లి కూతురు వాళ్ల బంధువులు అమ్మాయేనట. మూవీ మొఘల్, దివంగత రామానాయుడు తమ్ముడి మనువరాలినే అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్నాడట.

అంటే, సురేష్ బాబు చెల్లెలి కూతురితోనే ఏడు అడుగులు నడవబోతున్నాడు. అభిరామ్‌, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకరికొకరు ఇష్టపడుతున్నారట. వారి ఇష్టం మేరకు ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి ఓకే చెప్పారట. అమ్మాయి ఫారిన్ లో చదువుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కారంచేడులోనే అమ్మాయి కుటుంబం ఉంటోంది.

రీసెంట్ గానే ఇరు కుటుంబ సభ్యులు కలిసి ఈ పెళ్లి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అభిరామ్ పెళ్లి ముహూర్తంతో పాటు పెళ్లి వేదిక కూడా ఫిక్స్ అయినట్లు సురేష్ బాబు వెల్లడించారు. అభి పెళ్లి ఇండియాలో కాకుండా, శ్రీలంకలో జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిమంది బంధువులు, సన్నిహితుల నడుమ ఈ పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్‌ 6న శ్రీలంకలో ఈ పెళ్లి వేడుక జరగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లికి సంబంధించిన శుభలేఖలు కూడా సరికొత్తగా డిజైన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. రామానాయుడు సొంతూరు కారంచేడులోని పాత ఇల్లు డిజైన్‌ను శుభలేఖల మీద అచ్చువేయిస్తున్నారట కుటుంబ సభ్యులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker