News

అక్కినేని అఖిల్‌కు కాబోయే భార్య జైనాబ్‌.. మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

అఖిల్ అక్కినేనికి కూడా పెళ్లి ఫిక్స్ అయిపొయింది.. సైలెంట్ గా సన్నిహితుల మధ్య అఖిల్ కు జైనాబ్ రవ్జీ అనే అమ్మాయికి నిన్న నిశ్చితార్థం కూడా చేశారు. నిజానికి అఖిల్ కు ఇది వరకే నిశ్చితార్థం కూడా అయిపొయింది. తీరా పెళ్లి సమయానికి ఆ సంబంధం ఎగిరిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడి పెళ్లికి సిద్ధం అయ్యాడు అఖిల్. అయితే అయితే ఈ పెళ్లి పనుల్లో ఉండగానే అక్కినేని అఖిల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు.

ఈ విషయాన్ని హీరో నాగార్జునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. త్వరలోనే అఖిల్, జైనాబ్ ల వివాహం జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్, జైనాబ్ ల ఎంగేజ్ మెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి. ఇదే క్రమంలో జైనాబ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. జైనాబ్ హైదరాబాద్ లో పుట్టినా ఎక్కువగా ఢిల్లీ, దుబాయ్, ముంబైలోనే పెరిగిందట. ప్రస్తుతం ముంబైలోనే నివాసముంటున్నట్లు సమాచారం.

కాగా అఖిల్ తో ఎంగేజ్ మెంట్ అయిన వెంటనే జైనాబ్ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ను ప్రైవేట్ గా మార్చేసిందట. దీంతో ఆమె ఫొటోలు ఎక్కువగా బయటకు రావడం లేదు. అయితే జైనాబ్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ని రానా, మిహీక, ఉపాసన, మెహ్రీన్ తదితర సినిమా తారలు ఫాలో అవుతున్నారు. ఇక జైనబ్ రవ్జీ థియేటర్ ఆర్టిస్ట్, ఒక పెయింట్ ఆర్టిస్ట్ అని తెలుస్తోంది. గతంలో ఆమె వేసిన పెయింట్స్ పలు పెయింట్ ఎగ్జిబిషన్స్ లో ప్రదర్శించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అఖిల్, జైనాబ్ ల ఏజ్ గురించి సోషల్ మీడియాలో పలు రకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

వీరిద్దరి మధ్య సుమారు 9 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అక్కినేని అఖిల్ వయసు 30 కాగా.. జైనాబ్ కు 39 ఏళ్లు అని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో జైనాబ్ వయసు 27 ఏళ్లేనని మరికొన్ని కథనాలు తెలిపాయి. అయినా ప్రేమకు వయసు ముఖ్యం కాదని, మనసులు కలవడం ముఖ్యమని అక్కినేని అభిమానులు కాబోయే దంపతులకు విషెస్ చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker