వామ్మో, వయాగ్రా టాబ్లెట్స్ మొదట దేనికీ వాడె వాళ్ళో తెలుసా..?
వయాగ్రా ఒక అల్లోపతి ఔషధము. దీని అసలు పేరు సిల్డినాఫిల్ సిట్రేట్ . పురుషుల్లో అంగస్తంభన లోపాన్ని అధిగమించేందుకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక మందు ఇది! అమెరికా ఎఫ్‌డీఏ దీనికి అనుమతినిచ్చి 2014 నాటికి సరిగ్గా పదేళ్లవుతోంది. ఈ దశాబ్దకాలంలో అంతర్జాతీయంగా ఇది సృష్టించిన సంచలనానికి అంతులేదు. అయితే బ్రిటన్ లోని సౌత్ వేల్స్ లో మెర్తిల్ ట్విడ్ ఫిల్ అనే చిన్న పారిశ్రామిక పట్టణం ఉంది. అక్కడున్న ఒక ఉక్కు పరిశ్రమ మూతపడడంతో స్థానికంగా ఉండే కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి రోజువారీ ఆహారం దొరకడం కూడా కష్టమైపోయింది. ఈ సమయంలో వారి ఆర్ధిక ఇబ్బందులే వారిని క్లినికల్ గినీ పిగ్స్ గా మార్చేసింది.
నాడు వీరు అంగీకరించకపోతే వయాగ్రా పుట్టేదేకాదు అని అన్నా అతిశయోక్తి కాదు! 1990ల ప్రారంభంలో అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టేందుకు ఔషధాలు తయారు చేసే ఫైజర్ సంస్థ సిల్డెనాఫిల్ యుకె-92,480 అనే ఒక కాంపౌండ్ ను పరీక్షిస్తోంది. ఈ సమయంలో ఔషధాన్ని పరీక్షించడానికి స్థానిక యువకులను రిక్రూట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా 1992లో ఆ కొత్త ఔషధాన్ని పరీక్షించే ప్రక్రియలో పాల్గొనడానికి ఆ పట్టణంలోని కార్మికులు అంగీకరించారు. ఈ సమయంలో ఈ క్లీనీకల్ ట్రైల్స్ లో పాల్గొనడానికి వచ్చిన యువకులకు యుకె-92,480 పిల్ ను రోజుకు మూడు సార్లు చొప్పున వరుసగా పది రోజులపాటు వేసుకోవాలని కంపెనీ వాళ్లు చెప్పారు.
అందుకు కొంత డబ్బు చెల్లించారు. దానివల్ల వారికి మూడు పూటలా ఆహారంతోపాటు చలి కాచుకోడానికి అవసరమైన బొగ్గు సంచులు కూడా కావాల్సినన్ని దొరికేవి! వయాగ్రాకు దారితీసిన సైడ్ ఎఫెక్ట్!: ఇలా క్లీనికల్ ట్రయల్స్ లో భాగంగా ఆ డ్రగ్ వల్ల యువకుల్లో ఒక అనూహ్యమైన సైడ్ ఎఫెక్ట్ కనిపించింది. అవును… ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల అంగస్తంభన మామూలు కంటే కాస్త ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోందని వాళ్లు వైద్యులకు తెలిపారు. ఇదే సమయంలో ఇంతకు ముందుకంటే ఎక్కువగా అంగం గట్టిపడినట్లు అనిపించిందని వెల్లడించారు.
ఈ సైడ్ ఎఫెక్ట్స్ ను గమనించిన ఫైజర్ సంస్థ.. అప్పటికే జరుగుతున్న అధిక రక్తపోటు సంబంధ అధ్యయనంతోపాటూ నపుంసకత్వంపై కూడా రీసెర్చ్ చేయడానికి నిధులు సమకూర్చింది. ఈ క్రమంలో 1994 ప్రాంతంలో స్వాంజీలో తమ తదుపరి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే ముందు అంగస్తంభన సమస్యలు ఉన్న రోగులకు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించింది. ఇలా స్వాంజీలో జరిగిన అధ్యయనంలో ఫైజర్ సంస్థకు పాజిటివ్ ఫలితాలు కనిపించాయి. దీంతో తమ చేతిలో ఉన్న ఔషధం చరిత్ర సృష్టించబోతోందని వారికి త్వరగానే అర్థమైంది. ఈ సమయంలో ఈ పరీక్షల ఫలితాలు ఎంత పాజిటివ్ గా ఉన్నాయంటే… ట్రయల్స్ లో పాల్గొన్న మగవాళ్లు కొందరు వారికి ఇచ్చిన టాబ్లెట్లను కంపెనీకి తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు.