News

టాలీవుడ్ విలన్ భార్య గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్ ఇవే, ఆ స్టార్ హీరో కూడా..!

కరీనాకపూర్.. ముంబైకి తిరిగి వచ్చి విహార యాత్ర‌కు సంబంధించిన అరుదైన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. కరీనా తన భర్త సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి కొన్ని అద్భుతమైన ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేసింది. వీటిలో మేక‌ప్‌లెస్ లుక్ తో క‌రీనా క‌పూర్ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే బాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది. ఏ స్టార్ హీరోపైన, లేదంటే హీరోయిన్ గురించి రూమర్స్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతూనే ఉంటుంది.అయితే అందరికి గాసిప్స్ గురించి తెలుసుకోవాలనే ఉంటుంది. కాని బాలీవుడ్ లో మాత్రం ఇలాంటి గాసిప్స్ ముందుగా తెలిసేది టాలీవుడ్ స్టార్ విలన్, హిందీ హీరో భార్యకేనని మరో స్టార్ హీరో ఓ ఇంటర్వూలో బాంబ్ పేల్చాడు.

బాలీవుడ్ హార్ట్ త్రోబ్, చోటా నవాబ్ భార్య కరీనాకపూర్ కి ఈ గాసిప్స్ అన్నీ నిజంగానే అందాయి. ఈ నవాబు భార్యని అడిగితే చాలు. అన్ని గాసిప్ అప్‌డేట్స్ గురించి చెబుతుందని అజయ్ దేవగన్ సింగం ఎగైన్ ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అజయ్ ఈ విషయాన్ని చెప్పాడు. కరీనా గాసిప్ అప్‌డేటర్.. ఏదైనా గాసిప్ ముందుగా బయటకు రావాలంటే నటి కరీనా కపూర్ కి తెలిసిన తర్వాతే అందరికి తెలుస్తుందని ఇప్పటికే చాలా మంది స్టార్స్ చెప్పారు. మీకు బాలీవుడ్ గాసిప్‌ల గురించి ఏదైనా సమాచారం కావాలంటే కరీనా కపూర్‌కి ఫోన్ చేసి అడిగిే అంతా తెలిసిపోతుందని కామెంట్స్ కూడా చేశారు.

కరీనా గాసిప్స్ ఎలా తెలుస్తాయి..కరీనా కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెతో బాలీవుడ్ లో అందరూ కనెక్ట్ అయి ఉంటారు. అందుకే కరీనా కపూర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాన్ని అజయ్ దేవగన్ మళ్లీ సింగం సినిమాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. కరీనా కపూర్ గాసిప్స్ పుట్టిస్తుందా? అవును ఆ ఒక్క ఇంటర్వ్యూలోనే అజయ్ దేవగన్ ఇదే మాట చెప్పాడు. రణ్ వీర్ సింగ్ కూడా దీన్ని అంగీకరించాడని తెలిపాడు. అయితే గాసిప్‌ల విషయానికి వస్తే కరీనా కపూర్ మాత్రం మొదటి స్థానంలో ఉన్నానని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ గాసిప్స్ గురించి తాను చాలా అప్‌డేట్‌గా ఉన్నానని కరీనా చెప్పింది.

ఆమె తెలిసి చెబుతుందో లేద గాసిప్స్ పుట్టిస్తుందో తెలియదు కాని..ఇప్పటి వరకు చాలా మంది నటులు ఈ హీరో భార్య గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లో జరిగే ప్రతీ గాసిప్ కరీనాకపూర్‌కే ముందు తెలుస్తుందని కాబట్టి ఆమెను అడిగితే చాలు అంతా తెలిసిపోతుందని అందరికీ చాలా నీట్‌గా చెప్పాడు అజయ్ దేవగన్. దేవరతో టాలీవుడ్ లోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ మాత్రం హీరోగానే సినిమాలు చేస్తున్నాడు. చోటా నవాబ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కరీనా కూడా కొన్ని సినిమాలు తగ్గించినప్పటికి ..ఇప్పుడు మళ్లీ వరుస బెట్టి సినిమాలు చేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker