News

ఈ గ్రామంలో ప్రతి మగవారికి ఇద్దరేసి భార్యలు, ఎందుకో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.

హిందూ వివాహం ఒక పవిత్ర కార్యం అని గతంలో గుర్తింపు నివ్వడం జరిగింది. అయితే 1956 లో హిందూ వివాహ చట్టం రూపొందించిన తరువాత, వివాహానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ గానీ, విధానంగానీ చెప్పబడలేదు. అయితే వివిధ సంప్రదాయాలకు నిలయం మన భారతదేశం. దేశంలోని ప్రతీ గ్రామం.. ప్రత్యేకమైన ఆచారాలకు, సంప్రదాయాలకు ప్రసిద్ది చెందాయి.

అయితే పలు గ్రామాల్లోని కొన్ని సంప్రదాయాలు ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ కోవకు చెందినదే ఓ సంప్రదాయం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. రాజస్థాన్లోని జైసల్‌మీర్ జిల్లాలోని రామ్‌దేవర బస్తీ అనే గ్రామంలోని ప్రతీ పురుషుడు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకుంటాడట. ఇక తన భర్త రెండో పెళ్లి.. మొదటి భార్య ఏమాత్రం అడ్డుచెప్పదట.

వినడానికి ఇది విచిత్రంగా ఉన్నా.. అక్కడ ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. అంతేకాదు అక్కడి స్థానికులు ఈ సంప్రదాయాన్ని ఎంతగానో గౌరవిస్తారట. ఇంతకీ దీనికి కారణం ఏంటంటే.! రామ్‌దేవర బస్తీ గ్రామంలోని పురుషులు తమ మొదటి భార్య గర్భం దాల్చలేదని నమ్ముతారు. ఒకవేళ ఆమె గర్భం దాల్చినా.. కూతురే పుడుతుందట. అలాగే ఆ గ్రామంలో ఆడపిల్లల సంఖ్య పెరుగుతోంది. ఈ కారణంగానే అక్కడి పురుషులు రెండేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

తద్వారా తమ కుటుంబంలో వంశోద్ధారకుడు జన్మిస్తాడని అంటున్నారు. అయితే ఈ సంప్రదాయాన్ని నేటితరం యువత వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇంకొందరు.. సమాజంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ ప్రాంతంలో కాలానుగుణంగా పురుషుల సంఖ్య తక్కువగా ఉండటం, ఈ సంప్రదాయం వెనుక ఒక కారణమని వాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఈ సంప్రదాయాన్ని అక్కడి స్త్రీలు సైతం అంగీకరిస్తారట. తమ భర్తల కోసం మరో యువతిని అప్పుడప్పుడూ వారే చూస్తుంటారట కూడా.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker