చనిపోయేముందు మనిషి మెదడులో ఏం జరుగుతుందో మీరే తెలుసుకోండి.
మనిషి చనిపోయే ముందు తనకు ఎలాంటి ఆకలి ఉండదట. వారికి ఇష్టమైన ఆహారం పెట్టిన సరే తినడానికి ఇష్టపడరట. దానిని తిరస్కరిస్తారట. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. మరణానికి దగ్గర పడుతున్నవారు ఎక్కువగా వణుకుతారట. అది ఎండాకాలమైనా, చలికాలం అయినా, వర్షాకాలమైన చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే మనిషి బతికున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది. చనిపోయాక ఏం జరుగుతుందో ఆధ్యాత్మిక పరంగా కొందరు చెపుతుంటారు. అయితే చనిపోయే క్షణంలో మనిషి మెదడులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి.. దీనికి సంబంధించి న్యూరో సైంటిస్టులు ఏం చెపుతున్నారు.. చివరి క్షణాల్లో మైండ్ ఎలా రెస్పాండ్ అవుతుందనే విషయంలో శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు.
ప్రస్తుతం వైద్యరంగం అభివృద్ధి చెందుతుండటంతో.. ఇలాంటి చిక్కుముడులు నెమ్మదిగా విడుతున్నాయి. దాదాపు పదేళ్ల కిందట కొందరు సైంటిస్టులు ఎలకలపై పరిశోధనలు చేస్తున్నప్పుడు వాటి న్యూరో కెమికల్ ప్రాసెస్ ను గమనించారు. ఆ సమయంలో వాటి మైండ్ లో జరిగే మార్పులను శాస్త్రవేత్తలు.. ఎలకల్లో సెరోటోనిన్ రసాయనం ఎక్కువగా విడుదల కావడాన్ని గమనించారు. సెరోటోనిన్ అనేది ఫీలింగ్స్ ను కంట్రోల్ చేస్తుంది. ప్రవర్తన, మూడ్, జ్ఞాపకశక్తి, నేర్చుకోవడం, సంతోషం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర, ఆకలి.. ఇలాంటివాటిని రెగ్యులేట్ చేస్తుంది. ఒకవేళ దీని మోతాదు తగ్గితే.. డిప్రెషన్, యాంగ్జయిటీ.. ఇలా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే సెరోటోనిన్ ను ఫీల్ గుడ్ హార్మోన్ అని పిలుస్తారు. అయితే చనిపోయే ముందు ఈ సెరోటోనిన్ ఎలకల్లో ఎందుకు ఎక్కువ రిలీజ్ అయ్యిందనేది ప్రశ్న.
గుండె ఆగిపోయిన తర్వాత ఎవరికైనా చాలాసేపు నాడి అందకపోతే, వైద్యపరంగా వాళ్లు చనిపోయినట్లు భావిస్తారు. ఎందుకంటే మెదడు పనిచేయడానికి ఆక్సిజన్ చాలా అవసరం. గుండె రక్తాన్ని పంప్ చేయకపోతే ఆక్సిజన్ మెదడును చేరదు. దీంతో మెదడు కార్యకలాపాలు చాలా తగ్గిపోతాయని న్యూరో న్యూరో సైంటిస్ట్ జిమో బోర్జిగిన్ తెలిపారు. తాజాగా శాస్త్రవేత్తలు లైఫ్ సపోర్ట్ తీసుకుంటున్న నలుగురు రోగులను పరిశీలించారు. దీనిలో భాగంగా మెదడు పనితీరును స్కాన్ చేయడానికి ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ ఎలక్ట్రోడ్లను అమర్చారు. వారు బతికే అవకాశం లేకపోవడంతో.. వైద్యులు వాళ్లు వెంటిలేటర్లను ఆపేశారు. అప్పుడు ఇద్దరు రోగులలో మెదడు అత్యంత చురుకుగా ఉందని పరిశోధకులు గుర్తించారు.
నిజానికి కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడు నిస్తేజంగా ఉండటానికి బదులుగా.. చాలా చురుకుగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ మెదడుకు ఆక్సిజన్ అందడం లేదని తెలుసుకున్నప్పుడు అది ఏమవుతుందనే దానిని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నామని చెపుతున్నారు. ఇక మరణం అంచుల దాకా వెళ్ళిన కొందరు వ్యక్తులు.. తమ జీవితం కళ్ళ ముందు జీవితం ఒక్కసారి మెరుపులా మెరిసి పోతుందని.. లేదా జీవితంలోని కీలక క్షణాలు గుర్తుకు వచ్చాయని చెపుతుంటారు. చాలా మంది తాము తీవ్రమైన కాంతిని చూశామని, మరికొందరు తమ శరీరం తమది కాదన్న అనుభూతి కలిగిందని, పైనుంచి ఏవో దృశ్యాలను గమనిస్తున్నట్లు అనిపించిందని తెలిపారు.