హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్, కొడుకుని తీసుకోని భారత్ వదిలి వెళ్లిపోయిన హార్దిక్ భార్య నటాషా.
హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ మధ్య గత 6 నెలలుగా ఏం జరుగుతోంది.. ఎందుకు వేరువేరుగా ఉంటున్నారు. టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలిచిన తర్వాత కూడా నటాషా హార్దిక్ కోసం ఎందుకు పోస్ట్ చేయలేదు..? అంటూ వీరిద్దరిపై అభిమానుల మదిలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అయితే హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా స్టాంకోవిచ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె తన కుమారుడు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వదిలి వెళ్లిపోయిందని సమచారం.
హార్దిక్ పాండ్యాతో విడాకుల పుకార్లు షికార్లు సమయంలో నటాసా స్టాంకోవిచ్ తన లగేజ్‌బ్యాగ్ ను సర్దుకుని కుమారుడు అగస్త్యతో కలిసి ముంబై నుంచి వెళ్లిపోయింది. బుధవారం తెల్లవారుజామున వీరిద్దరూ ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నటాసా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కూడా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. మొదటి ఫొటోలో.. నటాషా తన దుస్తులతో ప్యాక్ చేయబడి ఉన్న తన సూట్‌కేస్‌ను చూపింది.
‘ఈ సంవత్సరంలో ఆ సమయం వచ్చింది’ అంటూ పలు ఎమోజీలను షేర్ చేసిందామె. కన్నీళ్లతో ఉన్న ఎమోజీతో పాటు విమానం, ఇల్లు, లవ్ సింబల్‌ను ఆమె షేర్ చేసింది. మరో ఫోటోలో, ఆమె తన పెంపుడు కుక్క ఫొటోస్ ను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. కాగా సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ 2013 బాలీవుడ్ సినిమా సత్యాగ్రహంతో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హిందీ సీజన్ 8 తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రేజ్ తోనే పలు సినిమాల్లో నటించి మెప్పించింది.
ఇదే సమయంలో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో ప్రేమలో పడింది. 2020లో అతనితో కలిసి పెళ్లిపీటలెక్కింది. వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నటాషా తన ఫ్యామిలీకే ప్రాధాన్యమిచ్చింది.