News

సౌందర్య వందల కోట్ల ఆస్తులు ఎవరు అనుభవిస్తున్నారో తెలుసా..?

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఒక చర్చ నడుస్తుంది, హీరోయిన్ గా నటించి సౌందర్య 100 కోట్లకు పైగానే ఆస్తులు సంపాదించుకుంది కదా అవి ఎవరు తీసుకున్నారు అని..? సౌందర్య 2003 లో రఘు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తను 2004 లో మరణించింది. అయితే ఇండస్ట్రీలో సావిత్రి తరువాత అంతటి పేరు సంపాదించుకున్న నటి సౌందర్య. అందం, నటనతో పాటు.. ఫ్యాషన్ డ్రస్సులు వేయకుండానే స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకుంది సౌందర్య. అందమైన చిరునవ్వుతో అభిమానులను ఆకర్షించిన నటి సౌందర్య. బెంగళూరుకు చెందిన ఆమె కన్నడ కుటుంబంలో పుట్టి పెరిగింది.

1972లో జన్మించిన సౌందర్య కన్నడ సినిమాల్లో నటిస్తూ.. టాలీవుడ్ ను చేరింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె.. దక్షిణ భారత భాషలలో వెలుగు వెలిగింది. 90వ దశకంలో సౌత్ ఇండియన్ సినిమా అగ్ర నటులుగా ఉన్న చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, మోహాన్ లాల్, వెంకటేష్, నాగార్జున, లతో కలిసి సౌందర్య నటించింది. అదేవిధంగా సౌందర్య తన 20 ఏళ్ల స్క్రీన్ కెరీర్‌లో సౌత్ ఇండియా టాప్ నటిగా ఎదిగింది. అటు బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ సరసన నటి సౌందర్య నటించింది. సూర్యవంశం హిందీ రీమేక్‌లో సౌందర్య దేవయాని పాత్రను పోషించింది. అమితాబ్ బచ్చన్ సరసన నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో హిందీ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఆ సమయంలో కన్నడ, తమిళం, మలయాళం వంటి దక్షిణ భారత భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న సౌందర్య.. బాలీవుడ్ సినిమాలు చేయలేకపోయింది. సౌందర్య సినిమాలు తగ్గుతున్న టైమ్ లో.. రాజకీయాల్లో రాణించాలని అనుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో ఆమె రాజకీయ రంగ ప్రశేశం చేసింది. 2004లో బీజేపీలో చేరారు. 17 ఏప్రిల్ 2004న, పార్టీకి ఓట్లు సేకరించేందుకు తన సోదరుడు అమర్‌నాథ్‌తో కలిసి హెలికాప్టర్ లో బయలు దేరిన ఆమె ప్రమాదంలో మరణించింది. హెలికాప్టర్ ఎగరగానే.. సాంకేతిక లోపంతో పేలిపోవడంతో సౌందర్య మరియు ఆమె సోదరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ దేశాన్ని విషాదంలో ముంచెత్తింది.

అప్పటికే పెళ్ళైన సౌందర్య.. మరణించే సమయానికి గర్భవతి కావడంతో ఆమె అభిమానులను వేదనకు గురిచేసింది. అయితే అప్పటికే సౌందర్య భారీగా ఆస్తులు కూడబెట్టిందని సమాచారం. అంతే కాదు ఆమె ఆస్తికి సబంధించిన వీలునామ కూడా ఎప్పుడో రాసేసిందట సౌందర్య. అయితే ఈ వీలునామాకు సబంధించిన సమాచారం బయటకు రాకుండా సౌందర్య భర్తతో పాటు.. ఆమె తల్లి దాచారని.. ఈ విషయంలో స్పందించడానికి కూడా ఆమె తల్లి, భర్త నిరాకరించారని సమాచారం. 31 ఏళ్ల వయసులో ఆమె వీలునామా రాయాల్సి అవసరం ఏముంటుంది అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం సౌందర్య 100 కోట్ల వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారడంతో.. రాసిచ్చిన వీలునామాను దాచిపెట్టి సౌందర్య తల్లి, భర్త ఆస్తులను సమానంగా పంచుకున్నారని వార్త నెట్టింట తెగ తరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది మాత్రం తెలియడం లేదు. సౌందర్య ఆస్తి ఎమయ్యింది అనేది ప్రస్తుతం మిస్టరీగానే మిగిలిపోయిన ప్రశ్న.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker