News

భర్తతో రోజాకి విభేదాలు, ఆ స్టార్ హీరో వల్లే అంటూ..?

90వ దశకంలో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లలో రోజా కూడా ఒకరు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ప్రేమ తపస్సు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రోజా. రోజా మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన… మరుసటి ఏడాది రోజా భర్త ఆర్.కే సెల్వమని దర్శకత్వం వహించిన ‘చెంబరుతి’ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా తమిళనాట సూపర్ హిట్టుగా నిలిచింది.

అయితే రోజా..ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో మంచి పనులు చేసింది.అయితే అలాంటి రోజా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపాలైంది. ఈమె మాత్రమే కాదు వైసిపి పార్టీ మొత్తం పూర్తిగా టిడిపి కూటమి హవాకి కొట్టుకుపోయింది. దీంతో రోజా అటు సినిమాలకు ఇటు రాజకీయాలకు రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయింది. ఎందుకంటే రోజా మంత్రిగా అయ్యాక సినిమాలకు షోలకు అన్నింటికీ స్వస్థి చెప్పింది. ఇదంతా పక్కన పెడితే గతంలో రోజా భర్త చేసిన పనికి ఇద్దరి మధ్య గొడవలు జరిగాయట.

అదేంటంటే.. రోజా భర్త తమిళ్ డైరెక్టర్ సెల్వమణి అందరికీ తెలుసు.అయితే ఈయన గతంలో తమిళ్ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు.అయితే అలాంటి డైరెక్టర్ సెల్వమణి హీరోగా సుమన్ ని పెట్టి భర్త సమరం అనే సినిమాని తీశారు. ఈ సినిమాకి నిర్మాతగా రోజా వ్యవహరించింది. అయితే భారీ ఎక్స్పెక్టేషన్ తో ఈ సినిమాని కి ఎంతో బడ్జెట్ పెట్టి రోజా నిర్మించినప్పటికీ సినిమా మొదటి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకొని పూర్తిగా డిజాస్టర్ అయింది.దాంతో ఈ సినిమా వల్ల రోజా కోట్లు నష్టపోయిందట. అలా భర్త వల్ల కోట్ల రూపాయలు నష్టపోయి రోజాకి సెల్వమణికి మధ్య కొన్ని రోజులు గొడవలు కూడా జరగాయట. తర్వాత కొద్ది రోజులకు ఆ గొడవలు అన్నీ సర్దుమనిగాయట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker