విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఈ ఆంటీ ఏం చేసిందో చుడండి, వైరల్ వీడియో.
ఇన్‌స్టాగ్రాంలో సల్మా షేక్ అనే అకౌంట్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. ప్యాసింజర్లు విమానంలోకి ఎక్కి కూర్చోగా, ఫ్లైట్ సిబ్బంది ఓవర్‌హెడ్ బిన్ క్లోజ్ చేస్తున్నారు. ఈ సమయంలో సల్మా షేక్ డ్యాన్స్ స్టార్ట్ చేసింది. ఫ్లైట్ టేకాఫ్‌కి రెడీ అవుతుండగా ఆమె ఇలా డ్యాన్స్ చేయడంతో తోటి ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు, చూసి చూడనట్లు వ్యవహరించారు. ముందుకు, వెనక్కి కదులుతూ వీడియో చేయడంతో ప్యాసింజర్లు ఇబ్బంది పడ్డారు.
అయినా పట్టించుకోకుండా సల్మా షేక్ డ్యాన్స్ కంటిన్యూ చేయడంతో ఆమెకు పిచ్చి పట్టిందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల ఇండిగో విమానంలో ఓ మహిళ ప్రయాణించింది. అయితే విమానంలో ఆమె అందరు ప్రయాణికుల్లా సీట్లో కూర్చోలేదు. విమానం గాలిలో ఉన్నప్పుడే తన ఇన్‌స్టాగ్రామ్ కోసం ఓ వీడియో చేసింది. అటూ ఇటూ ప్రయాణికులు సీట్లో కూర్చున్నప్పటికీ వారి మధ్యలో స్టైల్ స్టైల్ అనే పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియోను ‘సల్మా షేక్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో పోస్టు చేసింది. నెట్టింట్లో వైరల్..విమానంలో ఆటీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆంటీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాన్సెన్స్ చేయడానికి అదేమైనా ఆమె ప్రైవేటు విమానమా అని ప్రశ్నిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇలా డ్యాన్సులు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ‘ఇదొక చెత్త వీడియో. తను నలుగురి మధ్య ఈ వీడియో చేసిందని అభినందించాలా? లేకపోతే తాను ఎంపిక చేసిన చెత్త రీల్‌పై సెటైర్ వేయాలా?’ అని రాసుకొచ్చాడు. మరొకరు ‘ఇదేం నీ ఇల్లు కాదు, ఇలాంటి న్యూసెన్స్ ఆపండి’ అని ఫైర్ అయ్యాడు.
‘ఇన్నాళ్లూ ట్రాఫిక్ సిగ్నల్స్, రైళ్లలో మాత్రమే ఇటువంటి చెత్త చూసేవాడిని, ఇప్పుడు ఇది విమానాల దాకా చేరిందా?’ అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేవాడు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు కోరారు.