బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్న వేణుస్వామి, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
వేణుస్వామి సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు, క్రీడాకారుల జాతకాలు చెబుతూ నెట్టంట తెగ ఫేమస్ అయ్యారు. అయితే, ఈయన చెప్పిన జాతకాలు చాలాసార్లు తలకిందులైన విషయం తెలిసిందే. టాలీవుడ్ మాజీ కపుల్ నాగచైతన్య, సమంత విడాకులతో పాటు మరికొందరు సినీ ప్రముఖులకు సంబంధించి వేణు స్వామి చెప్పిన జాతకాలు మాత్రం నిజమయ్యాయి. కానీ, ఇటీవల ఆయన చెప్పిన కొన్ని జాతకాలు మాత్రం నిజం కాలేదు. అయితే సాధారణంగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు రెండు తెలుగు రాష్ట్రాలు సహా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది.
సెలబ్రిటీలకు జాతకం చెప్పడం, వారితో ప్రత్యేక పూజలు చేయించడంతో వేణు స్వామి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని కొన్ని కామెంట్స్ కూడా ఆయన్ను వార్తల్లో ఉండేలా చేసింది. అయితే ఆయన ఏది అనుకుంటున్నాడో అది మాత్రం నిక్కచ్చిగా చెప్పేస్తాడు. ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే.. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా మాట్లాడేస్తాడు. అలాంటప్పుడు కచ్చితంగా కంటెంట్ వస్తుంది. బిగ్ బాస్ నిర్వాహకులకు కావాల్సింది కూడా అదే.
అందుకే వేణుస్వామి కచ్చితంగా హౌస్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అలాగే ఆయనకు ఈ సీజన్ లోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ కూడా దక్కే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే బయట వేణుస్వామి పూజలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు అని ఎప్పటి నుంచో టాక్ ఉంది. అలాంటప్పుడు ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలి అంటే కచ్చితంగా అంతకు మించే దక్కాలి. ఒకవేళ ఆయన నిజంగానే వెళ్తే.. ఎలా ఆడతారు? అనేది కూడా ప్రధాన ప్రశ్న. మరి.. బిగ్ బాస్ లోకి వేణుస్వామి అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.