News

వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్,ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ద్రోణి ప్రభావంతో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, బుధ, గురువారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణం కేంద్రం, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే తెలంగాణలో పలు జిల్లాల్లో ఈ రోజు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉపరితల గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో ఐదు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నల్లగొండ, నారాయణపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మెదక్, జగిత్యాల, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడతామని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంటుందని.. సాయంత్రానికి వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఏపీ విషయానికి వస్తే.. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షపాతం నమోదవుతుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిన కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కుర్మనాథ్ తెలిపారు.

శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఉభయగోదావరి జిల్లాలు, నెల్లూరు, ఏలూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపారు. భారీ వర్షాల పడే ఛాన్స్ ఉన్న కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే ఛాన్సు ఉందని.. ఎవరూ చెట్ల కింద ఉండకూడదని తెలిపారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker