News

బాలకృష్ణ రెండో కూతురు సినిమాల్లోకి వెళ్తే స్టార్‌ హీరోయిన్‌ అయ్యేది. కానీ ఎందుకు పోలేదంటే..?

బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి చాలా మందికి తెలియదు. కానీ ఈమె ఇటీవల భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో సందడి చేసింది. తేజస్వని అందం హీరోయిన్స్ ని మించి ఉంది. ఇక ఆ వేడుకలో తేజస్విని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నటసింహం బాలయ్యకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి బ్రాహ్మణి, రెండో అమ్మాయి తేజస్విని.. అబ్బాయి మోక్షజ్ఞ. అయితే నిజానికి తేజస్విని చాలా రోజులుగా సినిమాలకు సంబంధించిన యాక్టివ్‌గా ఉంటుంది. తెరవెనుక బాలయ్యని లీడ్‌ చేస్తుంది.

ఎలాంటి కథలు ఎంచుకోవాలనే అంశాలతోపాటు ఆయన లుక్‌, కాస్ట్యూమ్స్, షో విషయంలోనూ ఆమె తెరవెనుక ఉండి నడిపించింది. బాలయ్య చేసిన అన్‌ స్టాపబుల్‌ షో తెరవెనుక కథ నడిచింది తేజస్వినినే, ఆయన లుక్‌నుంచి అన్ని తానే దగ్గరుండి చూసుకుంది. అందుకే ఇటీవల బాలయ్య లుక్‌కి మంచి పేరొచ్చింది. అంతేకాదు ఎలా ఉండాలనేది కూడా ఆమె గైడ్‌ చేస్తుందట. అన్‌స్టాపబుల్ షో సక్సెస్‌ కావడంలో ఆమె పాత్ర చాలా ఉందని తెలుస్తుంది. దీంతోపాటు గత మూడు నాలుగేళ్లుగా బాలకృష్ణ చేస్తున్న సినిమాల్లో చాలా మార్పు కనిపిస్తుంది.

ఎంచుకునే కథలతోపాటు, డైరెక్టర్స్ విషయంలో మార్పు ఉంది. బోయపాటి శ్రీను తప్పితే బాలయ్య చాలా వరకు యంగ్‌ డైరెక్టర్స్ తో పనిచేస్తున్నాడు. గోపీచంద్‌ మలినేని, అనిల్‌ రావిపూడి, ఇప్పుడు చేస్తున్న బాబీ ఇలా అంతా యంగ్‌ డైరెక్టర్స్. దీంతో కథలు కూడా కొత్తగా ఉండటమే కాదు, తన ఏజ్‌కి తగ్గ పాత్రలు చేస్తూ అలరిస్తున్నాడు బాలయ్య. ఇలా బాలయ్య సక్సెస్‌ వెనుక తేజస్విని కీ రోల్‌ ప్లే చేస్తుంది. కూతురులో ఉన్న ఆ ఆసక్తిని గమనించిన బాలయ్య.. ఆమెని మరింత పుష్‌ చేసే ప్రోగ్రామ్‌ పెట్టుకున్నాడు.

నిర్మాతగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా తొలి ప్రయత్నంగా బోయపాటితో చేయబోతున్న బీబీ4 చిత్రానికి తేజస్విని ని సమర్పకులుగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీని 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. భారీ టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో, భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker