News

ఆ హీరో మోసం చేయడం వల్లే ఇంకా పెళ్లి చేసుకొని శోభన..? అంత గబ్బు పనులు చేశాడా..?

వన్నెతరగని అందంతో పాటు నటన, నాట్యం ఇలా సకలకళా వల్లభురాలిగా శోభన ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆరు భాషల్లో దాదాపు 230కి పైగా సినిమాల్లో శోభన నటించింది. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఇలా చాలా విభాగాల్లో ది బెస్ట్ అనిపించుకుంది. అయితే విక్రమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ నటి. నాగార్జున నటించిన తొలి సినిమా ఇది ఈ సినిమాతోనే శోభన పరిచయం అయ్యింది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌, మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారు, గేమ్ లాంటి సినిమాలు చేసింది.

తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది శోభన. చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాళులో అద్భుతంగా నటించి అవార్డు అందుకుంది. శోభాన కేవలం హీరోయిన్ మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా.. క్లాసిక్ డాన్సర్ ఆమె.. నేషనల్ వైడ్ గా శోభన ఎన్నో పర్ఫామెన్స్ లు చేసింది. కానీ శోభన ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకుండా ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. అయితే శోభన పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి ఓ హీరో కారణం అని టాక్ వినిపిస్తుంది. ఓ హీరో చేసిన మోసం వల్లే శోభన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని టాక్ వినిపిస్తుంది.

అప్పట్లో స్టార్ హీరోలందరూ శోభనను హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపేవారు. శోభన ఆరు భాషల్లో 230కి పైగా సినిమాల్లో శోభన నటించింది. అయితే ఈ బ్యూటీకి ప్రస్తుతం 54 ఏళ్లు. కాగా ఇప్పటివరకు శోభన పెళ్లి చేసుకోలేదు. అయితే శోభన అప్పట్లో ఓ హీరోను ఇష్టపడిందట.. చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడిందట. అయితే ఇదే విషయాన్నీ శోభన ఆ హీరోకు చెప్తే ఆయన నో చెప్పాడట. దాంతో ఆమెకు పెళ్లి, ప్రేమ పై ఆసక్తి పోయిందట..దాంతో పెళ్లి లేకుండా ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తుందట.

మరి ఈ వార్తలో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తుంది.కాగా ప్రస్తుతం అడపదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు శోభన.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker