News

వామ్మో..! అఘోరాల్లో ఎవరైనా చనిపోతే వారి శవాన్ని ఏం చేస్తారో తెలుసా..?

శివుని ఐదు రూపాలలో అఘోర ఒకటి. శివుడిని ఆరాధించడానికి అఘోరాలు మృతదేహంపై కూర్చొని సాధన చేస్తారు. ఈ విధంగా ‘మృతదేహం నుంచి శివుని పొందడం’ అఘోర సంస్కారానికి సంకేతంగా భావిస్తారు.. ఈ అఘోరాలు శవ సాధన అనే పేరుతో 3 రకాల సాధనలు చేస్తారు. అందులో భాగంగా మొదటిది మృత దేహానికి మాంసం, మద్యాన్ని సమర్పించడం. రెండోది మృతదేహంపై ఒంటికాలిపై నిలబడి శివుని ఆరాధించడం, మూడోది శ్మశాన వాటికలో సాధన. అయితే అఘోరీ అనే పదం వినగానే గుర్తుకు వచ్చేది వారి రూపమే. అఘోరాల్లో చాలా మంది మానవ మాంసాన్ని తినడం, మంత్రవిద్యలు, తంత్ర-మంత్రాలు ఆచరించడం, వారి శరీరాలపై బూడిదను పూసుకోవడం వంటివి గుర్తుకు వస్తాయి.

అఘోరి అనేది సంస్కృత పదం. దీని అర్థం ‘వెలుగు వైపు’. అఘోరీలను పవిత్రంగా భావిస్తారు. వీరు అన్ని చెడులకు దూరంగా ఉంటారు. అఘోరీల ప్రపంచం సామాన్యుల జీవితం నుంచి పూర్తిగా వేరుగా వింతగా ఉంటుంది. అఘోరీలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతారు. పౌర్ణమి రాత్రులలో వారు శవాలపై కూర్చొని మంత్రాలతో పూజలు చేస్తుంటారు. చనిపోయినవారి నుంచి తమకు శక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అఘోరీలు ప్రతి మనిషిని తమ వారిలా చూసుకుంటారు. దీని వెనుక వారి వాదన ఏమిటంటే.. వారు అందర్నీ ఓకేలా చూస్తారు. అఘోరీగా మారాలంటే 12 ఏళ్లు శ్మశానంలో తపస్సు చేయాలి.

వారు సాధారణంగా నుంచి పొగ తాగుతారు. లోతైన ధ్యానం సమయంలో గంజాయి ధూమపానం వారికి బలమైన ఆధ్యాత్మిక అనుభూతితో పాటుగా ఇది.. వ్యాధులు, ఇతర సమస్యలను దూరం చేస్తుందని వారు నమ్ముతారు. అఘోరీలు త్యాగం చేసే సంప్రదాయాన్ని పాటిస్తారు. జంతువులను బలి ఇచ్చిన తర్వాత వాటి జంతు రూపం నుంచి విముక్తి పొందుతుందని అఘోరీలు నమ్ముతారు. అంటే మళ్లీ పుడితే అది జంతువుగా పుట్టదు. వారు మానవుల మృతదేహాల నుంచి పచ్చి మాంసాన్ని కూడా తింటారు. చాలా మంది అఘోరీలు అనేక ఇంటర్వ్యూలు, డాక్యుమెంటరీలలో ఈ విషయాన్ని అంగీకరించారు. ఇలా చేయడం వల్ల తమ సాంకేతిక శక్తులు బలపడతాయని వారు నమ్ముతున్నారు.

అఘోరీలు ఒకే చోట ఉండరు. వారణాసి లేదా కాశీ లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే ఈ నగరంలో అఘోరీల గుడి ఉంది. ఈ ఆలయంలో గంజాయి, మద్యాన్ని అందిస్తారు. అఘోరీలు శివుని, మృతదేహాలను పూజిస్తారు. శివుని ఐదు రూపాలలో ‘అఘోరా’ ఒకటి అని కూడా నమ్ముతారు. శివుడిని ఆరాధించడానికి, ఈ అఘోరీలు మృతదేహాలపై కూర్చొని విన్యాసాలు చేస్తారు. అందుకే శివుడిని స్మశాన దేవుడిగా భావిస్తారు. అఘోరీలతో ఎప్పుడూ మానవ పుర్రెలు ఉన్నాయని మీరు చూసి ఉంటారు. అఘోరీలు దీనిని పాత్రగా ఉపయోగిస్తారు. అందుకే వారిని కాపాలిక అని కూడా అంటారు.

శివుడు ఒకప్పుడు బ్రహ్మ తల నరికాడని చాలా కథలు చెబుతున్నాయి. దీని తరువాత, శివుడు ఆ తలను తీసుకొని విశ్వమంతా తిరిగాడు. శివుని ఈ రూపాన్ని అనుసరించే అఘోరీలు మానవ తలలను తమతో ఉంచుకుంటారు. ఒక అఘోరి చనిపోయినప్పుడు.. అతని అంత్యక్రియలు వారు చేయరు. దీనికి బదులుగా అతని శరీరం నీటిలో వదిలేస్తారు. శరీరాన్ని గంగలో నిమజ్జనం చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే.. అది వారి పాపాలను కడిగివేయడమే. మరో మాటలో చెప్పాలంటే.. సామాన్యులకు వింతగా, భయానకంగా అనిపించే విషయాలు అఘోరీల జీవితంలో ఒక భాగం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker