News

అరుదైన వ్యాధితో చాలా బాధ పడుతున్న అదా శర్మ, 48 రోజుల పాటు ఆగకుండా పీరియడ్స్‌ రావడంతో..!

అదా శర్మ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘హార్ట్ ఎటాక్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక మొదటి సినిమాతోనే కుర్రాళ్ల గుండెలను దొచేసిన ఈ బ్యూటీకి తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. అయితే 2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ది కేరళ స్టోరితో’ అదా శర్మ ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది. ఎందుకంటే.. ఇందులో శర్మ ప్రధాన పాత్రలో అలరించింది. దీంతో ది కేరళ స్టోరి మూవీ అదాకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టిందనే చెప్పవచ్చు. ఇక ఆ సినిమా తర్వాత అదా బస్తర్ ‘ది నక్సల్ స్టోరీ’ మూవీలో నటించింది.

ఇక ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీలో ఈ అమ్మాడు ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ చేసినవి తక్కువ సినిమాలే అయిన ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె ఒక క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతుంది. కాగా,ఇటీవలే ఆమె చేసిన రెండు సినిమాలు కూడా డిఫ్రెంట్ కాన్సెప్ట్ కావడమే కాకుండా.. వరుస హిట్స్ ను అందించాయి. ఇక ప్రస్తుతం మరొ కొత్త మూవీ ‘బార్‌తో’ డాన్సర్‌గా అదా శర్మ ప్రేక్షకులకు కనిపించబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా అదా శర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఓ అరుదైన వ్యాధి వచ్చిందనే షాకింగ్ విషయాలను బయట పెట్టింది. పైగా అది కూడా సినిమాల వల్లనే అని పేర్కొంది.

ఈ సందర్భంగా.. అదా శర్మ మాట్లాడుతూ.. నేను ది కేరళ స్టోరి మూవీలో నటించనప్పుడు కాలేజీ అమ్మాయిలా కనిపించడానికి బరువు తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత బస్తర్ ది నక్సల్ మూవీలో నటించినప్పుడు బరువు పెరిగాను. ఎందుకంటే.. ఆ సినిమాలో బరువైన గన్‌లను మోయాలి కాబట్టి లావుగా కనిపించడంతో పాటుగా కాస్త బలంగా ఉండడానికి 10 నుంచి 12 వరకు అరటి పండ్లు తిన్నాను. అలాగే గింజలు, డ్రై ఫ్రూట్స్ ఫ్లాక్ సీడ్స్ ఉన్న లడ్డూలను నాతో పాటు షూటింగ్ కు తీసుకెళ్లాను. ఈ క్రమంలోనే.. నిద్రపోయే అరగంట ముందు రెండు లడ్డులు తినేదాన్ని. కానీ ఇప్పుడు మళ్లీ బార్ సినిమా కోసం నేను బరువు తగ్గాల్సి వచ్చింది.

ఇలా నెలల వ్యవధిలోనే బరువు తగ్గడం, మళ్లీ పెరగడం, ఆ తర్వాత తగ్గడం వలన నా శరీరంలో రకరకాల మార్పులు చోటు చేసుకోవడంతో పాటు నేను ఒత్తిడికి గురయ్యాను. దీని వల్ల అనారోగ్యంకు గురయ్యాను. కాగా, నాకు ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ వ్యాధి వచ్చింది. అంటే పీరియడ్స్ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూ ఉంటుంది. ఈ జబ్బు కారణంగా నేను దాదాపు 48 రోజుల పాటు ఆగకుండా వచ్చే పీరియడ్స్‌తో చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అదా శర్మ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విషయం తెలిసిన ఫ్యాన్స్ కు అదాకు ఎంత కష్టం వచ్చిందంటూ బాధపడుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker