News

బలవంతంగా పిత్తుల్ని ఆపుకుంటే.. ఎంత ప్రమాదమో తెలుసా..?

మనిషి శ్వాస తీసుకోవడం, తినడం, పడుకోవడం.. ఎలా చేస్తాడో పిత్తులు కూడా అలాంటిదే. దీని గురించి నవ్వాల్సిన పని లేదు. ఇది శరీరంలో జరిగే ఒక ప్రక్రియ అంతే. కానీ ఈ విషయాన్ని చెప్పగానే చాలా మంది నవ్వడం మెుదలుపెడతారు. అయితే పిత్తులు రావడం సర్వసాధారణమైన విషయం. ఈ టాపిక్ రాగానే చాలా మంది నవ్వుకుంటూ ఉంటారు. నవ్వినా పర్వాలేదు కానీ.. ఈ విషయాన్ని మాత్రం చాలా సీరియస్‌గా తీసుకోవాలి. పిత్తుల గురించి ఈ విషయాలను ఖచ్చితంగా తీసుకోండి. దీనినే అపానవాయువు అని కూడా పిలుస్తారు. తిన్న తర్వాత పిత్తులు రావడం సాధారణంగా జరుగుతుంది.

అయితే బయటకు వెళ్లినప్పుడు ఎవరైనా నవ్వుతారని.. పిత్తులు వచ్చినా బలవంతంగా ఆపుకుంటారు. ఇలా బలవంతంగా అపాన వాయువుని ఆపడం వల్ల చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అపాన వాయువు బయటకు వెళ్లడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. బలవంతంగా ఆపితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. అయితే ఈ విషయం చాలా మందికి తెలీదు. శరీరంలో ఉన్న గ్యాస్ బయటకు వెళ్తుంది. ఒక్కోసారి పెద్దగా శబ్ధం వస్తుంది.

ఇలాంటి సమయంలో మాత్రం ఇతరుల ముందు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో బలవంతంగా ఆపేస్తారు. గ్యాస్ సమస్యలు:- శరీరం నుంచి గ్యాస్ కొన్ని సార్లు ఆగకుండా బయటకు వస్తుంది. దీన్ని ఆపడం వల్ల శరీరంలో అసౌకర్యం కలుగుతుంది. ఈ గ్యాస్ మళ్లీ లోపటికే ప్రవేశిస్తుంది. దీంతో కడుపు ఉబ్బినట్లు, నొప్పిగా అసౌకర్యంగా ఉంటుంది. గ్యాస్ మరింత పెరుగుతుంది. పెద్ద పేగు అనారోగ్యం:- అపాన వాయువు బయటకు వెళ్లడం వల్ల.. శరీరంలో ఒత్తిడి కూడా తగ్గుతుంది.

కానీ ఇది బయటకు రానప్పుడు లేదా బలవంతంగా ఆపినప్పుడు పెద్దపేగు పై ప్రభావం పడుతుంది. ఇది హేమోరాయిడ్లకు కారణం అవుతుంది. గ్యాస్ బయటకు వెళ్తేనే మీకు రిలీఫ్ గా ఉంటుంది. కడుపు ఉబ్బరం:-బయటకు వెళ్లే గ్యాస్‌ని ఆపడం వల్ల.. అది తిరిగి శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో కడుపు ఉబ్బినట్లు ఉంటుంది. దీంతో తిన్న ఆహారం సరిగా అరగదు. ఆకలి వేసినా ఏమీ తినాలని అనిపించదు. వికారంగా, వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా అసౌకర్యంగా ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker