ప్రాణంగా ప్రేమించిన భర్తకు మంచు లక్ష్మి ఎందుకు విడాకులు ఇచ్చిందో తెలుసా..?
చాలామంది తారలు పెళ్లి చేసుకున్నంత స్పీడ్ గా విడాకులు తీసుకున్న సందర్బాలు ఉన్నాయి. ఈక్రమంలో కొంత మంది స్టార్స్ రెండో పెళ్ళి కూడా చేసుకున్నారు. కాని వారి మొదటి పెళ్లి ఎలా పెటాకులు అయ్యింది అన్నదానిపై చాలా మందికి తెలియదు. అందులో ముఖ్యంగా మంచువారి ఆడపడుచు లక్ష్మీ మొదటి భర్తకు సబంధించిన న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మంచు లక్ష్మి..
ఇండస్ట్రీలో ఉన్న అందరికంటే ఈమె కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటుంది. లక్ష్మీ ఒక్కటే కాదు మంచు ఫ్యామిలీ మొత్తం డిఫరెంట్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇప్పటికే వారిపై చాలా ట్రోల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇకపోతే మంచు లక్ష్మి చదువుకుంటున్న సమయంలోనే తన కాలేజీ స్నేహితుడైన ఒక వ్యక్తిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయి మరీ ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని అతడికి భార్యగా మారిపోయింది.
అయితే తన ప్రేమను మంచు మోహన్ బాబు కాదనడంతో మంచు లక్ష్మికి కోపం వచ్చే బయటకు వెళ్లి పెళ్లి చేసుకుందని సమాచారం . ముఖ్యంగా మోహన్ బాబు ఊర్లో లేని సమయంలో ఎవరికి చెప్పకుండా ఆర్య సమాజంలో తాను ప్రేమించిన శ్రీనివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. విషయం తెలుసుకున్న మోహన్ బాబు కూతురుని ఏమీ అనకుండా అతడిని చాలా ఇబ్బంది పడేలా చేశారట. అతడి కుటుంబ సభ్యులను, బంధువుల్ని కూడా రౌడీలను పెట్టి బెదిరించారని అప్పటి వాళ్ళు చెప్పుకునేవారు.
ఇక బెదిరింపులు , భరించలేని మంచు లక్ష్మి తండ్రితో ఏదో ఒకటి తేల్చుకుందామని ఇంటికి వెళ్లిందట.. కానీ మంచు మోహన్ బాబు మాటలకు ఏ మనసు మార్చుకుందో తెలియదు కానీ అతడికి విడాకులు ఇచ్చేసి తండ్రి చూసిన ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక్కడ యాదృచ్ఛికమేమిటంటే మంచు లక్ష్మి రెండవసారి వివాహం చేసుకున్న వ్యక్తి పేరు కూడా శ్రీనివాస్ కావడం గమనార్హం. ఇక వీరికి ఒక అమ్మాయి కూడా జన్మించింది.