News

భర్తను రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్న మాజీ మిస్ వైజాగ్, వైరల్ అవ్తున్న వీడియో.

నక్షత్ర 2012లో మిస్ వైజాగ్‎గా ఎంపికైంది. ఆ తర్వాత సినిమా ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో అదే సినీ రంగంలో ఉన్న త్రిపురానేని సాయి వెంకట తేజతో పరిచయం ఏర్పడింది. అదికాస్త వివాహానికి దారితీసింది. 2013 లో నక్షత్రను సాయి వెంకట తేజకు పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఏడేళ్ల పాప కూడా ఉంది. అయితే పెళ్ళైన కొన్నాళ్ళు బాగానే ఉన్న తేజ.. ఆ తర్వాత తనలోని లైంగిక వాంఛలను బయటకు చెప్పాడు. తాను అందంగా ఉన్నానని చాలా మంది అమ్మాయిలు తనతో శారీరక సంబంధాలను, లైంగిక వాంఛలకు ఇష్టపడతూ ఉన్నారని నేరుగా తనకే చెప్పారని చెప్తోంది భార్య నక్షత్ర. అయితే తనకు విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీతో అక్రమ సంబంధం నెరుపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది భార్య నక్షత్ర.

మిస్ వైజాగ్ నక్షత్రకు 2015లో త్రిపురాణ తేజ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. కాగా, వీరికి ఓ కుమార్తె జన్మించింది. పెళ్లైన నాటి నుండి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు తన ఆఫీసు రూంలో అమ్మాయితో ఉండగా.. నక్షత్ర రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని భర్త చెంపలు వాయించింది. తనకు విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ అతడి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. అతడి అకృత్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకు వస్తుంది. 2013లో ఓ షూటింగ్‌ సమయంలో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారగా.. .

రెండేళ్ల ప్రేమ తర్వాత 2015లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి అతడి నిజ స్వరూపం బయటకు వచ్చిందని చెబుతోంది నక్షత్ర. పెళ్లైన దగ్గర నుండి అదనపు కట్నం అంటూ హింసకు గురి చేసేవాడని తెలిపింది. అతడు నేవీలో పనిచేస్తూ ఉండేవాడని, కానీ కరోనా సమయంలో పబ్జీకి అలవాడు పడ్డాడని, విధులకు కూడా సరిగ్గా హాజరయ్యేవాడు కాదని తెలిపింది. ఆ గేమ్‌లో అమ్మాయిల్ని ట్రాప్ చేసేవాడని, ప్రశ్నిస్తే తనను హింసకు గురి చేసేవాడని తెలిపింది. సరిగ్గా ఉద్యోగానికి కూడా వెళ్లకపోవడంతో విధుల నుండి తొలగించారని పేర్కొంది ఈ మాజీ మిస్ వైజాగ్. ఎంతో మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనకు విడాకులు ఇవ్వకుండా మరొకర్ని పెళ్లి చేసుకున్నాడని చెబుతుంది.

అతడికి చాలా ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయని, తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది నక్షత్ర. తనకు సినిమాల పిచ్చి అని, మూవీలు చేసేస్తానని, హీరో అయిపోతానని తన వద్ద బంగారాన్ని తాకట్టు పెట్టేశాడని, అలాగే తన అమ్మనాన్నల దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడని తెలిపింది. తాను సినిమాలు చేయమని ఏనాడు ఆపలేదని, బ్యాక్ డోర్ మూవీ తామిద్దరం కలిసి ఉండగానే అతడు చేశాడని చెప్పింది ఈ మిస్ వైజాగ్. బ్యాక్ డోర్ మూవీ హీరోయిన్ తనతో డేట్ చేయమన్నదని, తనను రమ్మన్నదని భర్త తన వద్ద వాగేవాడని, ఈ విషయాన్ని ఆ మూవీ దర్శకుడి వద్దకు తీసుకెళితే.. అవన్నీ ఉత్తి మాటలు అని చెప్పినట్లు పేర్కొంది నక్షత్ర. ఈ విషయం హీరోయిన్ వరకు వెళ్లిందో లేదో తనకు తెలియదని చెప్పింది నక్షత్ర. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker