News

హేమపై పోలీసులు సీరియస్, ఈసారి విచారణకు రాకుంటే జైలుకే.

బెంగళూరు రేవ్ పార్టీపై కేసు నమోదు చేసారు పోలీసులు. కానీ ఈ రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు అధికారులు. 100- 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని.. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు బెంగళూరు పోలీసులు. అయితే రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బెంగళూరు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని హేమతో పాటు 8 మందికి నోటీసులు ఇచ్చారు. గతంలో నోటీసులు ఇచ్చినా కొందరు హాజరుకాకపోవడంతో బెంగళూరు పోలీసులు సీరియస్‌ అయ్యారు. ఈసారి హాజరుకాకుంటే తీవ్ర పరిణామలు ఉంటాయని తాజా నోటీసుల్లో హెచ్చరించారు.

బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకడంతో.. ఆ పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. 86 మంది బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో.. ఈనెల 27న విచారణకు హాజరు కావాలని హేమతోపాటు పలువురికి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే.. అనారోగ్య కారణాలతో హేమ విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే.. హేమతోపాటు 8మందికి మరోసారి నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. న్‌ స్క్రీన్‌ మీదే కాదు.. ఆఫ్‌ స్క్రీన్‌లోనూ తన నటనతో అదరగొట్టారు నటి హేమ.

బెంగళూరు రేవ్‌ పార్టీ న్యూస్ బయటకు రావడంతో వెంటనే ఓ వీడియో వదిలారు హేమ. రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆస్కార్‌ రేంజ్‌లో పర్ఫామెన్స్ చేశారు హేమ. నేను అమాయకురాలిని అంటూ నాటకాలు ఆడి అడ్డంగా ఇరుక్కుంది. అతి తెలివి తేటలతో పోలీసులను బోల్తా కొట్టిద్దామని.. తానే బొక్కా బోర్లా పడింది హేమ. ఇటీవల పోలీసులు రేవ్‌ పార్టీలో హాజరైన వారికి డ్రగ్స్ టెస్ట్ చేశారు. పోలీసుల విచార‌ణలో భాగంగా హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించ‌గా.. రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది.

దాంతో ఆమె అడ్డంగా బుక్ అయ్యింది. డ్రగ్స్ టెస్ట్‌లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హేమ‌తో పాటు డ్రగ్స్ టెస్ట్‌లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ హేమా యాక్టింగ్‌ ఆపలేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి. టైమ్‌ వచ్చినప్పుడు మాట్లాడతానంటూ సినిమా డైలాగులు కొట్టింది హేమ. అలాగే మనమేమి దేవుళ్ళం కాదు.. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అంటూ డైలాగ్స్ చెప్పింది హేమ.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker