జబర్దస్త్ కి గుడ్ బై చెప్పి స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.
ఒకానొక సమయంలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఇంద్రజ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఇంద్రజ. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇంద్రజ పేరు మారు మ్రోగింది. ఇక హీరోయిన్ గా రాణించిన ఇంద్రజ ప్రస్తుతం పలు టీవీ షోల్లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. పెళ్లి తర్వాత ఇంద్రజ సినిమాలకు దూరం అయ్యారు.
ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ తో అలరిస్తుంది. అయితే గతంలో జబర్దస్త్ కి ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు. ఇందుకు ప్రధాన కారణం షోలో జరుగుతున్న మార్పులు చేర్పులు. నాగబాబు, రోజా జడ్జిలుగా ఉన్నంత కాలం జబర్దస్త్ టాప్ టీఆర్పీ తో దూసుకుపోయింది. మల్లెమాల సంస్థతో విబేధాలు తలెత్తగా నాగబాబు షో నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో సింగర్ మనో జడ్జిగా వచ్చారు. రోజాకు మంత్రి పదవి దక్కింది.
నిబంధనల ప్రకారం ఆమె జబర్దస్త్ ని వీడాల్సి వచ్చింది. యాంకర్ అనసూయ, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర… ఇలా ఒకరి తర్వాత ఒకరు షో నుండి బయటకు వచ్చేశారు. దీంతో జూనియర్ కమెడియన్స్ తో జబర్దస్త్ షోని నడిపిస్తున్నారు. కాగా రోజా స్థానంలో నటి ఇంద్రజను జడ్జి గా తీసుకొచ్చారు. ఇంద్రజ తక్కువ సమయంలోనే కమెడియన్స్ తో కలిసిపోయింది. వాళ్లపై రివర్స్ పంచులు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇంద్రజ.
చాలా కాలంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇంద్రజ బాంబు పేల్చారు. ఆమె అనూహ్యంగా షో నుండి తప్పుకుంటున్నట్లు చెప్పి షాకిచ్చింది. ఆమె జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేస్తున్నట్లు వివరించింది. ఈ విషయం చెప్తూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అయితే కొంతకాలం గ్యాప్ తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో ఇంద్రజ వెళ్లిపోతుంటే కమెడియన్లు కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం జబర్దస్త్ ని వీడినా, మరలా ఆమె రీ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.