అందుకే హైపర్ ఆది నా టీమ్ నుండి వెళ్ళిపోయాడు, వాస్తవాలు బయటపెట్టిన గురువు అదిరే అభి.
హైపర్ ఆది అనతి కాలంలో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. తిరుగు లేని స్థాయికి వెళ్ళాడు. ఒక దశలో హైపర్ ఆది లేకపోతే జబర్దస్త్ లేదన్నట్లు తయారైంది. ఆయన ప్రత్యేక ఆకర్షణగా మారాడు. అదే సమయంలో హైపర్ ఆది విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. హైపర్ ఆదిని అదిరే అభి జబర్దస్త్ కి పరిచయం చేశాడు. అత్తారింటికి దారేది సన్నివేశాన్ని అదిరే అభి స్పూఫ్ చేశాడు. ఆ వీడియో అదిరే అభికి పంపాడట.
అది చూసిన అదిరే అభి ఒకసారి కలవు తమ్ముడు అని హైపర్ ఆదితో అన్నాడట. అలా అదిరే అభి టీమ్ లోకి వచ్చిన హైపర్ ఆది… స్కిట్స్ రాయడం నేర్చుకున్నాడు. అయితే హైపర్ ఆదితో విభేదాలు రావడం వల్లే అభి జబర్దస్త్ మానేసాడు అంటూ అప్పట్లో రూమర్స్ వినిపించాయి. గతంలో కూడా ఈ పుకార్లను ఇద్దరూ కొట్టిపారేశారు. తాజాగా మరోసారి అదిరే అభి ఈ రూమర్స్ పై స్పందించాడు. అసలేం జరిగిందో క్లారిటీగా వివరించాడు.
అభి మాట్లాడుతూ .. ”హైపర్ ఆది నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. నాతో విబేధాల కారణంగానే బయటకు వెళ్ళిపోయాడు అన్న వార్తల్లో నిజం లేదు. అప్పట్లో కొత్త టీమ్స్ ఏర్పాటు చేయాలని సెకండ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళందరిని కలిపి ఒక టీంను తయారు చేశారు. అలా హైపర్ ఆదికి టీం లీడర్ అయ్యే అవకాశం వచ్చింది. హైపర్ ఆది టీం లీడర్ అయినందుకు సంతోషించాను. నాకు సినిమా డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకే జబర్దస్త్ లో కొనసాగుతూనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై ఫోకస్ పెట్టాను.
ఇప్పుడు కూడా దర్శకుడిగా సక్సెస్ కావాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నాను”, అంటూ చెప్పుకొచ్చాడు. కాగా హైపర్ ఆది ని జబర్దస్త్ కి పరిచయం చేసింది అదిరే అభినే. అందుకే హైపర్ ఆదికి అదిరే అభి గురువు లాంటివాడు. అదిరే అభి టీం లో కమెడియన్ గా చేస్తూ ఆది టీం లీడర్ గా ఎదిగాడు. తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ హోదా దక్కించుకున్నాడు. ప్రస్తుతం హైపర్ ఆది అటు సినిమాలు మరోవైపు షోలు చేస్తు బిజీగా మారిపోయాడు.