పెళ్లి వేదికపై అందరు చూస్తుండగానే వరుడిపై పెళ్లికూతురి మాజీ లవర్ దాడి, వైరల్ వీడియో.
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. చాలా మంది యూజర్లు దీనిపై స్పందించారు. కొందరు ఎక్స్బాయ్ఫ్రెండ్ తీరును తప్పుబట్టారు. అతడు వయలెంట్‌గా ఉన్నాడని ఒక వ్యక్తి చెప్తే, మరికొందరు పిరికివాడిగా పేర్కొన్నారు. అందరి ముందు వేదికపై వరుడిని కొట్టడం సరికాదని కొందరు కామెంట్లు చేశారు.
ప్రేమ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిపై దాడి చేయడాన్ని తప్పుబట్టారు. దీనికి ఏకంగా 1.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి పీటలు ఎక్కాలని లేదు. వివిధ కారణాలతో చాలామంది మధ్యలోనే విడిపోతున్నారు. కొందరు పరిస్థితుల ప్రభావంతో బ్రేకప్ చెప్పుకుంటారు. అయితే ప్రేమించిన వారికి ఇతరులతో పెళ్లి జరిగితే, అవతలి వ్యక్తి బాధ వర్ణించలేం. ఈ పరిస్థితిని ఒక్కొక్కరు ఒక్కోలా డీల్ చేస్తారు.
కానీ రాజస్థాన్‌లో ఓ వ్యక్తి మాత్రం, తన ఎక్స్ లవర్ వేరొకరిని పెళ్లి చేసుకోవడం చూసి హర్ట్ అయ్యాడు. దీంతో పెళ్లి వేదికపైనే వరుడిపై దాడిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వెంటనే చాలా మంది నెటిజన్లకు షాహిద్ కపూర్ హిట్ మూవీ ‘కబీర్ సింగ్’ గుర్తుకు వచ్చింది. ఇది తెలుగు ‘అర్జున్ రెడ్డి’ రీమేక్. ఈ వీడియోలో పెళ్లి కూతురి ఎక్స్ బాయ్‌ఫ్రెండ్, పెళ్లి కొడుకుని పదే పదే కొట్టడం కనిపించింది.
ఈ సంఘటన రాజస్థాన్‌లోని భిల్వారాలో జరిగింది. దాడి జరుగుతుందని ముందు ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే నవదంపతులతో ఫొటో దిగేందుకు వధువు మాజీ ప్రియుడు వేదికపైకి వెళ్లాడు. అకస్మాత్తుగా వరుడిపై దాడి చేశాడు. దీంతో అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు.
Wanna be Kabir Singh kinda Kalesh b/w Ex-Boyfriend and Groom on Wedding Stage (The ex bf and Bride were Teacher in same school) Bhilwara RJpic.twitter.com/OkOiMbs5Yl
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 19, 2024