ఆనందంతో తేలియాడుతున్న రోజా కూతురు, అసలు విషయం ఏంటంటే..?
2002 ఆగస్టు 21న రోజా ఆర్‌కే సెల్వమణిని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రోజా.. రోజా సెల్వమణికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు, ఒక కూతురు.
అయితే తల్లికి తగ్గ కూతురిగా అన్షు మాలికకు యూత్‌లో చాలా క్రేజ్ ఉంది. రోజా కూతురు అన్షు మాళిక కూడా మంచి అందగత్తే. ఆమె తన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఏపీలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చిత్తూరు జిల్లా నగరిలో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆర్కే రోజా.
తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రోజా కూతురు అన్షు మల్లిక. దీంతో అన్షుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంత్రి రోజా కూతురు అన్షు మాలిక అందంలో అచ్చం అమ్మ పోలికే. ఆ నవ్వు, ముఖం మొత్తం అమ్మ రోజాలాగే ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫొటోలకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు.
రోజా కూతురు అన్షు మాలిక చిన్న వయసులో సత్తా చాటుతోంది. అన్షు వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా ప్రతిభ చూపిస్తోంది. అన్షు ఓ మంచి రైటర్ కూడా. ఆమె రాసిన పుస్తకానికి జీ టౌన్ మ్యాగజైన్ నుంచి బెస్ట్ ఆథర్ ఫ్రం సౌత్ ఇండియా అవార్డు లభించింది.