News

సినిమాలు ఆపేసి ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తున్న సీనియర్ హీరోయిన్‌, అసలు ఇలా ఎందుకు చేస్తుందో తెలుసా..?

మంగుళూరులో పుట్టిన శిల్పా శెట్టి మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. 1993లో విడుదలైన బాజీగర్ ఆమె డెబ్యూ మూవీ. షారుక్ ఖాన్-కాజోల్ ప్రధాన పాత్రలు చేయగా శిల్పా శెట్టి సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం సూపర్ హిట్. రెండో చిత్రం ఆగ్. హీరో గోవిందకు జంటగా లీడ్ హీరోయిన్ రోల్ చేసింది. అనతికాలంలో ఫేమ్ తెచ్చుకున్న శిల్పా శెట్టి బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ పట్టేసింది. దర్శకుడు రాఘవేంద్రరావు టాలీవుడ్ కి పరిచయం చేశాడు. వెంకటేష్ కి జంటగా సాహసవీరుడు సాగరకన్య చిత్రాన్ని చేసింది.

అయితే ఇక అది అలా ఉంటే నటి శిల్పాశెట్టి తాజాగా అస్సాంలోని గౌహతిలోని కామాఖ్య ఆలయంలో అక్కడి సంప్రదాయ పద్దతిలో ప్రార్థనలు చేసింది. దీనికి సంబందించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శిల్పా శెట్టి సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ భామ అయిన శిల్పా శెట్టికి తెలుగు సినిమాలతో మంచి అనుబంధమే ఉంది. ఈమె త్వరలో ఓ ప్యాన్ ఇండియా తెలుగు ప్రాజెక్ట్‌తో పలకరించబోతున్నట్టు సమాచారం. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.

చేతిలో సినిమాలు లేకున్నా.. ఈ మంగళూరు భామ.. తనదైన యోగాసనాలతో ఎపుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. శిల్పాశెట్టికి కేవలం హిందీ ఇండస్ట్రీతోనే కాదు.. తెలుగులోనూ ఈ భామ పలు చిత్రాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా పలకరించింది. తెలుగు విషయానికొస్తే.. ఈమె మొదటిసారి వెంకటేష్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాతో తొలిసారి తెలుగు తెరపై కనిపించింది.

ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. తాజాగా ఈ భామ.. తెలుగులో నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే శిల్పా శెట్టి… ఓ బడా హీరో సినిమాలో ఓ ఇంపార్టెంట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈమెకు సోషల్ మీడియాలో 30 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మోహన్ బాబు హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీడెవడండీ బాబు’ సినిమాలో నటించింది.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలచింది. చివరగా బాలకృష్ణ హీరోగా నటించిన ‘భలే వాడివి బాసూ’ సినిమాలోకనిపించింది శిల్పాశెట్టి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత తన కన్న చిన్నవాడైన రాజ్ కుంద్రాను పెళ్లాడి ఇద్దరు పిల్లకు తల్లైంది. ప్రస్తుతం నటిగా రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు కొన్ని రియాలిటీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker