హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలు దేరిన చిరంజీవి, ఎందుకో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ హీరోగా సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన ఆయన.. ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో తనదైన మార్కును చూపిస్తున్నాడు. అలా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో పాటు కూటమిని గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే సినీరంగానికి చేసిన సేవతో పాటు ఆ మధ్య కరోనా సమయంలో.. లాక్‌డౌన్ రావడంతో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
ఇక ఈ అవార్డ్‌ను ఆయన రేపు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈక్రమంలో చిరంజీవి తాజాగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలు దేరారు. దీనికి సంబంధించిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన కూడా ఢిల్లీకి వెళ్లారని సమాచారం.
రేపు సాయంత్రం రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకోనున్నారు చిరంజీవి. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్, నటి, రాజకీయవేత్త విజయశాంతి నటిస్తున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు ఇప్పటికే విజయశాంతిని కలిసి, తన పాత్ర గురించి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో క్లారిటీ రానుంది. గతంలో చిరంజీవి, విజయశాంతి కలయికలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ కాంబినేషన్ మళ్ళీ కుదిరితే విశ్వంభర కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.
Megastar @KChiruTweets is on his way to Delhi to receive the prestigious Padma Vibhushan award tomorrow at Rashtrapati Bhavan✨#PadmaVibhushanChiranjeevi #Chiranjeevi #PadmaVibhushanMegaStarChiranjeevi pic.twitter.com/dIl0GMvrE7
— Sai Satish (@PROSaiSatish) May 8, 2024