ఈ క్యూట్ హీరోయిన్ ఇప్పుడు ఎలా మరిపోయిందో చుడండి. ఎప్పుడు కూడా..!
హాట్ హాట్ ఫోజులతో హీటెక్కిస్తుంది శ్వేతా బసు ప్రసాద్. హద్దులు పక్కన పెట్టి .. కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది. వయ్యారాలన్నీ ఒలకబోస్తూ రెచ్చిపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ మెప్పిస్తుంది. అయితే ఫస్ట్ మూవీతోనే స్టార్ డమ్ సంపాదించుకుంది శ్వేత బసు ప్రసాద్. యంగ్ హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్వేత.
మొదటి సినిమా విజయం సాధించడంతో ఈ అమ్మాడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అలాగే అప్పట్లో స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ ఫస్ట్ హిట్ తర్వాత సరైన సినిమాలు ఎంచుకోవడంలో విఫలమయ్యింది. దీంతో ఈ బ్యూటీ ఖాతాలో వరుస డిజాస్టర్స్ వచ్చి చేరాయి. శ్వేత నటించిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మెల్లగా ఈ బ్యూటీ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది.
పలు చిత్రాల్లో హీరోయిన్ గా మెరిసిన శ్వేత.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. అయినా ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు. దీంతో అటు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేస్తూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈబ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లకు షాకిస్తున్నాయి. ఒకప్పుడు ట్రెడిషనల్ లుక్స్ లో ఎంతో క్యూట్ గా కనిపించిన ఇప్పుడు గ్లామర్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అప్పట్లో బొద్దుగా ఉన్న ఆ అమ్మడు.. ఇప్పుడు జీరో సైజ్ లోకి మారిపోయింది. ప్రస్తుతం శ్వేత బసు ప్రసాద్ ఫోటోస్ వైరలవుతున్నాయి.