బాలకృష్ణకు భారీగా ఆస్తులతో పాటు అప్పులు, మోక్షజ్ఞ వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగుతున్నారు నందమూరి బాలకృష్ణ. హిందూపురం నుంచి ఇప్పటికే రెండుసార్లు విజయం సాధించిన బాలయ్య బాబు.. ఈ సారి కూడా గెలుపు తనదే అని గర్జిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన నామినేషన్ వేశారు. అయితే హిందూపురం టీడీపీకి కంచుకోట…. అందుకే తప్పుకుండా తాను మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని బాలయ్య కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
ఇక తాజాగా ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. అభిమాన సందోహంతో పాటు వెళ్లి.. నామినేషన్ వేశారు బాలయ్య. నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందూపురం టీడీపీకి కంచుకోట…. అందుకే తప్పుకుండా తాను మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని బాలయ్య కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇక తాజాగా ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. అభిమాన సందోహంతో పాటు వెళ్లి.. నామినేషన్ వేశారు బాలయ్య.
కాగా నామినేషన్ లో తెలిపిన విధంగా.. బాలయ్య ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య ఆస్తలతో పాటు.. అప్పులు కూడా కలిగి ఉన్నారు. అంతే కాదు ఆయన పేరిట కంటే ఆయన భార్య పేరిట ఎక్కువ ఆస్తులు ఉండటం హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ పేరిట 81 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉండగా.. 9 కోట్ల.. 9 లక్షల అప్పులు ఉన్నట్టు వివరాలు సమర్పించారు బాలయ్య. ఇక ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ 140 కోట్ల 38 లక్షల 83 వేలు కావడం గమనార్హం.
బాలయ్య కంటే కూడా ఆమె ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి. ఇక బాలయ్య వారసులు.. కాబోయే హీరో.. మోక్షజ్ఞ ఆస్తుల విలువ 58 కోట్ల 63 లక్షల 66 వేలు ఉన్నట్టు వివరాలు సమర్పించారు. ఆస్తులు.. అప్పులతో కూడిన పూర్తి వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈసారి ఎలక్షన్స్ వాడీవేడిగా సాగుతుండగా.. ఎవరు గెలుస్తారుఅన్నది ఆసక్తి కరంగా మారింది. ఇక ఈ ఎలక్షన్ రిజల్ట్ తరువాత బాలయ్య తననెక్ట్స్ సినిమాల షూటింగ్స్ పై దృష్టి పెట్టబోతున్నట్టుతెలుస్తోంది.